ముంబై: ఇటీవల కాస్త నెమ్మదించిన పుత్తడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర మళ్లీ  రూ. 39 వేల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ నివారణకు మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్‌ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి.  

also read ముకేశ్ అంబానీ మొత్తం సంపాదన ఎంతో తెలుసా....

ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లోనూ ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం రూ. 191 పెరిగి 10 గ్రాముల ధర రూ. 39,239 పలికింది. అటు వెండి ధర ఇదే బాటలో పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 943 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,146కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే ఆరు డాలర్లు పెరిగి 1,495 స్థాయికి చేరింది. గత నెల ఏడో తేదీ తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం.ఈ నవంబర్‌లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి.

also read ఇండియాలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ ఏదో తెలుసా...?

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడయింది.సోమవారం రాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా సోమవారం మార్కెట్‌ ముగిసే సరికి రూ.266  లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం తదితర పండుగల నేపథ్యంలో డిమాండ్‌ స్వల్పంగా పుంజుకునే అవకాశం ఉందని బులియన్‌ వర్తకులు భావిస్తున్నారు.