- Home
- Business
- Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Business Idea: ఉద్యోగం రాలేదని బాధపడేవారికి బియ్యం వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఇంట్లోనే ఉంటూ నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు ఎలా సంపాదించాలో..

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం!
చాలామంది యువత ఉద్యోగం రాలేదని నిరాశ చెందుతుంటారు. అయితే, మన నిత్య జీవితంలో అత్యవసరమైన బియ్యం వ్యాపారాన్ని ప్రారంభిస్తే తక్కువ కాలంలోనే మంచి లాభాలను ఆర్జించవచ్చు. కేవలం రూ. 20,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మీ గ్రామంలో లేదా పట్టణంలో సులభంగా మొదలుపెట్టవచ్చు.
వ్యాపారం ఎలా చేయాలి.?
మీరు బ్రాండెడ్ రైస్, మిల్లింగ్ రైస్ లేదా ట్రేడింగ్ రైస్ ప్లాంట్ల నుంచి హోల్‌సేల్ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేయాలి. ఆ బియ్యాన్ని 10kg, 25kg, 50kg బస్తాలుగా ప్యాక్ చేసి విక్రయించాల్సి ఉంటుంది.
పెట్టుబడి, లాభాలు
ప్రారంభంలో రూ. 20,000 పెట్టుబడి సరిపోతుంది. ఒక్క బియ్యం బస్తాపై సుమారు రూ. 50 నుంచి రూ. 200 వరకు లాభం మిగులుతుంది. మీరు రోజుకు కేవలం 10 బస్తాలు విక్రయించినా నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చు.
మార్కెట్ వేగంగా..
బియ్యం అనేది నిత్యావసర వస్తువు కాబట్టి మార్కెట్ వేగంగా ఉంటుంది. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీరు ప్యాక్ చేసిన బియ్యాన్ని స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు నేరుగా సరఫరా చేయవచ్చు.
మార్కెటింగ్‌తో విస్తరణ
అంతేకాకుండా,ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఆర్డర్లు పొంది మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. స్వయం ఉపాధిని కోరుకునేవారికి, చిన్నపాటి పెట్టుబడితో స్థిరమైన ఆదాయం అందించే బియ్యం వ్యాపారం ఒక బెస్ట్ ఆప్షన్.

