MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Gold Rate Today: పసిడి కొనేవారికి గుడ్‍న్యూస్...దిగొచ్చిన ధరలు

Gold Rate Today: పసిడి కొనేవారికి గుడ్‍న్యూస్...దిగొచ్చిన ధరలు

Gold Rate Today: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్నిరోజులు తగ్గితే..ఆ తర్వాత వెంటనే ఆకాశానికి చేరుకుంటున్నాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 09 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్లీ గుడ్‍న్యూస్
Image Credit : Asianet News

మళ్లీ గుడ్‍న్యూస్

బంగారం కొనలనేవారికి మళ్లీ గుడ్‍న్యూస్. మొన్నటివరకూ తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన ధరలు...మళ్లీ ఈరోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇండియాలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల మార్పులు, దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే రూపాయి, డాలర్ విలువలు దేశీయ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి రేట్లు పెరగడం లేకపోతే రూపాయి విలువ పడిపోయే పరిస్థితుల్లో దేశీయ మార్కెట్‌లోనూ కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీగా దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Image Credit : our own

భారీగా దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు ఆసక్తి కనబర్చారు. దీంతో మార్కెట్‌లో సప్లై పెరిగి ధరలు అలా అలా తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో వెండి రేట్లపైనా మార్పులు కనిపించాయి. గతంలో రూ.4లక్షలకు పైగా ఉన్న ఉండి ఇప్పుడు రూ.లక్షా పాతికవేలు తగ్గింది. 

ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరల కారణంగా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారం కొన్నారు.అదే సమయంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడం ప్రారంభించారు. దీంతో మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు క్రమంగా తగ్గుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి కూడా తగ్గింది.

Related Articles

Related image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Related image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
35
కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించే అంశం
Image Credit : our own

కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించే అంశం

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై సుమారు రూ.1950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి 10 గ్రాములపై దాదాపు రూ.1800 వరకు పడిపోయింది. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు.  

45
ఇదే మంచి అవకాశం
Image Credit : our own

ఇదే మంచి అవకాశం

ధరలు తగ్గాక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,61,680 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వరకు తగ్గింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. 

55
బంగారం బాటలోనే వెండి
Image Credit : Getty

బంగారం బాటలోనే వెండి

ఇక వెండి ధరల విషయానికి వస్తే భారీగానే తగ్గింది. కిలో వెండి ధరపై దాదాపు రూ.5000 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‍లో రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,80,000 వరకు ఉంది.

మొత్తంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ బలం, అలాగే పెట్టుబడిదారుల నిర్ణయాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Idea: ఇంట్లో కూర్చునే రూ. లక్షల్లో సంపాదన.. డిమాండ్ ఎక్కువ.. ఇప్పుడిదే ట్రెండింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved