న్యూఢిల్లీ: మీరు నడిపే బైక్ గురించి మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుంది. ఎప్పుడో గానీ అది నిజమయ్యే చాన్స్ రాదు. అటువంటి చాన్సే బజాజ్ మీ ముంగిట్లోకి తీసుకొస్తోంది. బజాజ్ పల్సర్ 180 మోడల్ మోటార్ బైక్ పేరిట అభివ్రుద్ధి చేసిన ఈ బైక్.. అచ్చంగా డుకాటీ స్క్రాంబ్లర్ మాదిరిగానే ఉంటుంది. 

ఇంజిన్, చాసిస్ మినహా బజాజ్ పల్సర్ 180 మోడల్ బైక్‌లో అమర్చే ఫీచర్లు, కాంపొనెంట్లు వివిధ ఉత్పాదక సంస్థలు, కస్టమ్ మేడ్‌గా ఉపయోగించినవే.  220 సీసీ ఇంజిన్ తీసేసి అదనంగా ఆయిల్ కూలర్ ఫీచర్ చేర్చారు. డీనికి అదనంగా ఛాసిస్‌ను మరింత మెరుగ్గా మోడిఫై చేశారు. 

డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ ఫెండర్‌లతోపాటు కేటీఎం డ్యూక్ బైక్‌లో మాదిరిగా బజాజ్ 180 మోడల్ బైక్‌లో స్విన్ గార్మ్, అల్లాయ్, ఇంజిన్ బెల్లీ పాన్ తదితర ఫీచర్లు చేర్చారు. డీఆర్ఎల్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ లైట్, ఆఫ్ సెట్ స్పీడో మీటర్ చేర్చారు. బజాజ్ పల్సర్ 178 సీసీ బైక్ నుంచి 17 బీహెచ్పీ, 14 ఎన్ఎం ఆఫ్ సామర్థ్యం గల టార్చ్ అమర్చారు. ఇంకా ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కూడా చేర్చినట్లు సమాచారం.