క్రిస్మస్ సందర్భంగా స్టార్ ప్లేయర్ కి కోట్ల విలువైన లగ్జరీ గిఫ్ట్.. ఇతని కార్ కలెక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే
రొనాల్డోకు ఫుట్‌బాల్‌తో పాటు కార్లంటే పిచ్చి. రోల్స్ రాయిస్ డాన్ ఇప్పుడు అతని పెద్ద కార్ల కలెక్షన్ లో వచ్చి చేరింది. ఈ కారు ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డోకి మొదటి రోల్స్ రాయిస్ కారు కాదు. అయితే రోనాల్డోకి ఇంతకుముందే కుల్లినన్ ఎస్‌యూవి, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూడా ఉంది.
స్పానిష్ మోడల్ అండ్ డాన్సర్ జార్జినా రోడ్రిగ్జ్ క్రిస్మస్ సందర్భంగా ఆమె భర్త క్రిస్టియానో రొనాల్డోకు రోల్స్ రాయిస్ డాన్ కన్వర్టిబుల్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కొత్త గిఫ్ట్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో ఈ జంట పిల్లలతో కలిసి కారులో చూడవచ్చు. అయితే అంతకంటే ముందు రొనాల్డో కార్ కలెక్షన్ గురించి తెలుసుకొండి...
రొనాల్డో కార్ కలెక్షన్
రొనాల్డోకు ఫుట్‌బాల్‌తో పాటు కార్లంటే పిచ్చి. రోల్స్ రాయిస్ డాన్ ఇప్పుడు అతని పెద్ద కార్ల కలెక్షన్ లో వచ్చి చేరింది. ఈ కారు ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డోకి మొదటి రోల్స్ రాయిస్ కారు కాదు. అయితే రోనాల్డోకి ఇంతకుముందే కుల్లినన్ ఎస్‌యూవి, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూడా ఉంది. ఈ ఫుట్‌బాల్ స్టార్‌కి ఇతర కార్లు కూడా ఉన్నాయి. రోనాల్డో కార్ల కలెక్షన్ లో చిరోన్, వేరాన్, బుగట్టి సెంటోడిసి తో పాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు - బుగట్టి లా వోయిచర్ నోయిర్ వంటి చాలా అరుదైన కార్లు ఉన్నాయి.
అంతే కాకుండా, అతని కార్ల కలెక్షన్ లో మెక్‌లారెన్ సెన్నా, ఫెరారీ 335 S స్పైడర్ స్కాగ్లియెట్టి, 599 GTO, 599 GTB ఫియోరానో, ఫేరరీ F304 ఉన్నాయి. వీటికి అదనంగా రోనాల్డో ఆస్టన్ మార్టిన్ DB9, మసెరటి గ్రాన్ కాబ్రియో, BMW M6, మెర్సిడెస్ G-క్లాస్, C220 CDIలో కనిపిస్తుంటారు. అతనికి కెయెన్, 911 2ఎస్ క్యాబ్రియోలెట్, మరొక కయెన్ టర్బోతో పోర్షే కార్లు కూడా ఉన్నాయి.
అతనికి బెంట్లీ కాంటినెంటల్ GT, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ తో పాటు లంబోర్ఘిని అవెంటడోర్ LP 700-4 కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ గ్యారేజీలో భాగంగా Audi Q7, Audi RS6 కూడా ఉన్నాయి.
రోల్స్ రాయిస్ డాన్
రోల్స్ రాయిస్ డాన్ అనేది రోనాల్డో ఇంటికి వచ్చిన చాలా విలాసవంతమైన కారు, ఈ కారు ఇప్పుడు అతని పెద్ద కార్ కాన్వాయ్‌లో భాగమైంది. ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్‌ని పొందుతుంది. ఈ ఇంజన్ 563 bhp శక్తిని, 820 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ మోడల్ 4.3 సెకన్లలో 0-100 kmph స్పీడ్ అందుకోగలదు.
చాలా సౌకర్యవంతమైన ప్రయాణాన్నిఅందిస్తుంది
ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే చాలా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. శాటిలైట్-ఎయిడెడ్ సస్పెన్షన్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇంకా మీరు ప్రయాణించే భూభాగానికి అనుగుణంగా రైడ్ క్వాలిటీ అడ్జస్ట్ చేస్తుంది. కస్టమైజేషన్ ఆప్షన్‌లను మినహాయిస్తే, రోల్స్ రాయిస్ డాన్ ధర భారతదేశంలో దాదాపు రూ. 7 కోట్లు. మీరు కస్టమైజేషన్ ఆప్షన్ కోసం వెళితే, మీరు సెలెక్ట్ చేసుకున్నా ఆప్షన్స్ బట్టి ధర ఆకాశాన్ని తాకుతుంది.
ఇంతకుముందు స్పానిష్ మోడల్ జార్జినా రోడ్రిగ్జ్ రోనాల్డోకు అతని 37వ పుట్టినరోజున కాడిలాక్ ఎస్కలేడ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఎస్కలేడ్ 5.5 మీటర్ల పొడవు ఉంటుంది, అయితే ఈ కారు 414 bhp శక్తిని ఉత్పత్తి చేసే 6.2-లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 ఇంజన్‌ను పొందుతుంది. దీనికి 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. ఈ కారు 5.9 సెకన్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది.