600 కి.మీ మైలేజీ.. సూపర్ ఫెసిలిటిస్.. స్మూత్ డ్రైవింగ్.. టాటా కర్వ్ ధర ఎంతంటే ?
Tata Curvv EV 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, లెవెల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఇండియాలో టాటా కార్స్ కి మంచి ఆదరణ ఉంది. దీనిని అనుసరించి కొన్ని ఎలక్ట్రిక్ మోడల్ కార్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో లేటెస్ట్ మోడల్ టాటా కర్వ్ EV ఆగస్ట్ 7, 2024న మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఎలెక్ట్రిఫైడ్ Curvv భారతదేశపు మొట్టమొదటి మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV కూపే అవుతుంది. ఈ కార్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. అంటే సుమారు దాదాపు 600 కి.మీ ప్రయాణించవచ్చు. జెస్చర్ యాక్టివేషన్‌తో సెగ్మెంట్-ఫస్ట్ పవర్డ్ టెయిల్‌గేట్ లెథెరెట్ సీట్లు, లెదర్-ర్యాప్డ్ ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ అండ్ మల్టీ-డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది.
సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో 5 సీట్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ స్టాండర్డ్ గా ఉంటుంది. లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూతో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌ని ఎనేబుల్ చేసే లెవల్ 2 ADAS కూడా ఉంది.
వైర్‌లెస్ Apple CarPlay, Android Autoతో హర్మాన్ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సబ్ వూఫర్, EV యాప్ సూట్ 20+ యాప్‌లతో సహా తొమ్మిది స్పీకర్‌లతో కూడిన JBL సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అంతేకాదు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, దీనికి స్టాండర్డ్ 7.2 kW ఛార్జర్ లభిస్తుంది. దీని ధర రూ. 15.49 లక్షల నుండి రూ. 19.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా .