పెద్ద కార్ల విభాగంలో ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన కార్లలో మారుతీ ఎర్టిగా ఒకటి. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (CSD) ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే 28% GSTకి బదులుగా 14% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దీంతో సైనిక సిబ్బందికి మంచి డబ్బు ఆదా అవుతుంది. ఎర్టిగా Lxi వేరియంట్ CSD ధర ₹7.89 లక్షలు. దీని సివిల్ ఎక్స్-షోరూమ్ ధర ₹8.69 లక్షలు. అంటే, ఈ వేరియంట్‌పై ₹80,000 ఆదా. ఎనిమిది వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి, గరిష్టంగా ₹94,000 వరకు ఆదా చేసుకోవచ్చు.