TATA Sumo : 28 కి.మీ మైలేజ్ తో మళ్లీ రోడ్లపైకి టాటా సుమో... ధర ఎంతుండొచ్చో తెలుసా?
TATA Sumo 2025 : భారతీయులకు సుపరిచితమైన టాటా సుమో సరికొత్త ఫీచర్లతో మళ్ళీ రోడ్డెక్కనుంది. సరికొత్త ఫీచర్లు, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఈ సుమోను తీసుకువస్తోంది.

TATA Sumo 2025
TATA Sumo 2025 : ఇప్పుడు టూవీలర్లతో పోటీపడిమరి కార్లు రోడ్డుమీదకు వస్తున్నాయి. పదుల సంఖ్యలో వున్న కంపనీల నుండి వందలాదిగా మోడల్స్, వేలాదిగా కార్లు మార్కెట్ లోకి వస్తున్నారు. ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ నెలకొంది... దీంతో తక్కువ ధరకే మంచి ఫీచర్లతో వాహనాలు వస్తున్నాయి. అంతేకాదు గతంలో బాగా సక్సెస్ అయిన వాహనాలను సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి కంపనీలు. ఇలా తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం టాటా కూడా సరికొత్త ఫీచర్లతో ఓ పాత మోడల్ ను తీసుకువస్తోంది.
అతి తక్కువధరకే అత్యాధునికి ఫీచర్లతో మరోసారి టాటా సుమో రోడ్డెక్కనున్నాయి. ఒకప్పుడు ఆటో రంగాన్ని ఓ ఊపుఊపిన ఈ వాహనం ఎస్‌యూవీలో ఫస్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మరోసారి మార్కెట్ ను షేక్ చేసేందుకు టాటా సుమో సిద్దమయ్యింది. త్వరలోని దీన్ని మార్కెట్ లోకి విడుదల చేసేందుకు టాటా కంపనీ సిద్దమయ్యింది.
TATA Sumo 2025
న్యూ టాటా సుమోపై అంచనాలు :
టాటా సుమో భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు కొత్త అర్థం చెప్పింది. వ్యక్తిగత వాడకం నుంచి ఆసుపత్రి, స్కూల్ వాహనాల వరకు సుమో చాలా కాలంపాటు రోడ్లపై రాజ్యమేలింది. కానీ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుల కారణంగా ఇది వెనకబడిపోయింది. కానీ ఈ టాటా సుమో ఇప్పటికీ చాలామందికి ఓ ఎమోషన్.
టాటా సుమో క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మరోసారి వీటిని మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ ను రెడీచేసింది టాటా. ఇటీవల దేశ రాజధాని డిల్లీలో జరిగిన భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్‌పో 2025 లో దీన్ని ప్రదర్శించారు.
టాటా సుమో నయా లుక్ అదిరిపోయింది. అలాగే అందులో ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా వున్నాయి. దీంతో ఇది ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు వినియోగదారులు. ఈ వాహనాన్ని చూస్తే గతంలో మాదిరిగా మళ్లీ ఆటో రంగాన్ని షేక్ చేసేలా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
TATA Sumo 2025
టాటా సుమో సరికొత్త ఫీచర్లివే :
టాటా సుమో గతంలో మాదిరిగానే బాక్సీ లుక్ తో వస్తోంది. అయితే డిజైన్ మాత్రం ఆకట్టుకునేలా వుంది... పాత సుమోకే ఆధునిక హంగులు జోడించి సరికొత్తగా రూపొందించారు. ఫ్రంట్ లుక్ చాలా రాయల్ గా వుంది... ఎల్ఈడి హెడ్ లైట్లు, బంపర్ సుమో లుక్ ను మరింత అద్భుతంగా మార్చాయి. ప్రస్తుతం మార్కెట్ లోని పెద్దపెద్ద ఎస్‌యూవీలను పోలి ట్రెండీగా కనిపిస్తోంది.
ఇక ఈ టాటా సుమో సైడ్ లుక్ కూడా అదిరిపోయింది. పెద్దపెద్ద డోర్స్, విండోస్, వీల్ ఆర్చ్ కనువిందు చేయనున్నాయి. అలాగే సుమో ట్రేడ్ మర్క్ బ్యాక్ లుక్ కలిగివుంది. ఇలా ఎటువైపునుండి చూసినా ఈ న్యూ టాటా సుమో ఔట్ లుక్ అద్భుతంగా వుంది.
న్యూ సుమో గతంలో కంటే పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఆటో రంగంలో వున్న ప్రచారం ప్రకారం దీని పొడవు 4400mm, వెడల్పు 1780mm, ఎత్తు 1785mm, వీల్‌బేస్ దాదాపు 2750mm ఉంటుందని తెలుస్తోంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ సుమారు 200mm వుంటుందని... ఇది ఇండియన్ రోడ్లపై ప్రయాణానికి సులభంగా వుంటుంది.
న్యూ టాటా సుమో ఇంటీరియర్ విషయానికి వస్తే డ్రైవర్ తో కలిపి ఎనిమిది సీట్లతో వస్తోంది. సీట్లు గతంలో మాదిరిగా కాకుండా మరింత సౌకర్యవంతంగా వుండేలా తీర్చిదిద్దారు. డాష్ బోర్డ్ కూడా డ్రైవర్ కు ఉపయోగపడే టచ్ బటన్స్ తో వస్తుందని చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టచ్ స్క్రీన్ ను ఇందులో ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
టాటా సుమో సుదూర ప్రయాణాలకు ఉపయోగించే వాహనం. కాబట్టి లగేజ్ ఎక్కువగా పట్టేలా బూట్ స్పేస్ వుంటుంది. దాదాపు 300 లీటర్ల బూట్ స్పేస్ వుంటుందని అంచనా వేస్తున్నారు... సీట్లను మడిచడంద్వారా దీన్ని 700 లీటర్లకు పెంచుకునే అవకాశం వుంటుంది. ఇక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కారు మొత్తాన్నిచల్లబర్చేలా ఏసి కలిగివుంది ఈ న్యూ టాటా సుమో.
ఇక ఈ టాటా సుమో ఇంజన్ లో కూడా మార్పులు చేపట్టారు. పాత ఇంజన్ ను పూర్తిగా మార్చేసి సరికొత్త టెక్నాలజీని ఇంజన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇంజన్ విషయంలో ఆలోచించే అవసరం లేకుండా దీన్ని రూపొందించినట్లు టాటా సంస్థ చెబుతోంది.
మైలేజ్, ధర :
కొత్త టాటా సుమో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. డిజిల్ అయితే లీటర్ కు 15-17 కి.మీ, పెట్రోల్ అయితే లీటర్ కు 13-15 కి.మీ, సిఎన్జి అయితే కేజీకి 25-28 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
టాటా సంస్థ ఇప్పటివరకు న్యూ సుమో ధరను వెల్లడించలేదు. అయితే ఆటో మార్కెట్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బేసిక్ మోడల్ ధర రూ.4 నుండి రూ.7 లక్షల లోపు వుండే అవకాశం వుంది.