Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి సెడాన్, ఎస్‌యూవీ మోడల్ ‘మెర్సిడెస్’ ఆల్ టెరైన్!

ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్- బెంజ్’ కారు ఎస్‌యూవీ ప్లస్ ఈక్లాస్ సెడాన్ మోడల్స్ కలగలిసిన కారు ‘ఆల్ టెరైన్’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.75 లక్షలు.

Mercedes-Benz E-Class All-Terrain Launched In India: Priced At  75 Lakh
Author
New Delhi, First Published Sep 29, 2018, 10:36 AM IST

న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ దేశీయ మార్కెట్లోకి అధునాతన ఈ-క్లాస్‌ ఆల్‌ టెర్రైన్‌ కారును తీసుకు వచ్చింది. ఈ కారు ధరను రూ.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. కొత్త ఈ-క్లాస్‌ కారును బెంజ్‌ సంస్థ బీఎస్‌-4 ఇంధన ప్రమాణాలతో పాటు నాలుగు సిలండర్ల డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందించింది. ఈ వాహనం ఇంజిన్‌ 194 హెచ్‌పీ సామర్థ్యంతో పని చేస్తుందని సంస్థ తెలిపింది. భారత మార్కెట్లోకి అంతర్జాతీయ ప్రమాణాలతో మరిన్ని కార్లను ప్రవేశపెట్టే విధానానికి ఇక్కడ వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎండీ, సీఈవో రోలాండ్‌ ఫోల్గర్‌ తెలిపారు. మెర్సిడెస్ బెంచ్ ఈ క్లాస్ మోడల్ కారు ‘ఆల్ టెరైన్’ అత్యంత సమర్థవంతమైంది కావడంతోపాటు మిగతా మోడల్ కార్లతో భిన్నమైందని చెప్పారు. 

ఈ కొత్త కారు గంటకు 231 కి.మీ. స్పీడ్‌తో దూసుకుపోగలదని. మరింత స్టోరేజీ నిమిత్తం కారులో వెనక సీట్లను మడుచుకొనే వెసులు బాటు కూడా కల్పించామని బెంజ్‌ తెలిపింది. కొత్త కారుకు కూడా మార్కెట్‌ వర్గాల నుంచి మేటి స్పందన వస్తుందని తాము భావిస్తున్నట్లు బెంజ్‌ తెలిపింది. ‘ఆల్ టెరైన్’ మోడల్ కారును మొదట భారతదేశంలో గత ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆటో ఎక్స్ పో’లో ప్రదర్శించింది. ఈ క్రమంలో ప్రస్తుత పండుగల సీజన్‌లో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ క్లాస్ సెడాన్ కారు నుంచి లగ్జరీ ఫీచర్లను తెచ్చుకున్న ఆల్ టెరైన్ మోడల్ కారు 4 మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వ్యవస్థను కలిగి ఉన్నది. అంతే కాదు భారతదేశం అంతటా ‘వోల్వో వీ90’ మోడల్ కారుతో తలపడబోతున్నది. లగ్జరీ, సొగసు కలగలిసిన విభిన్నమైన ఈ - క్లాస్ మోడల్ కారుగా ఆల్ టెరైన్ నిలిచిపోనున్నది. 

నూతన మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఆల్ టెరైన్ ‘ఈ 220 డీ 4 మాటిక్’, 2.0 లీటర్ల నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్, 3800 ఆర్పీఎం వద్ద 192 బీహెచ్పీ, 1600 - 2800 ఆర్పీఎం వద్ద 400 ఎన్ఎం అభివ్రుద్ధి చేసే సామర్థ్యం దీని సంతం. 9జీ- ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సామర్థ్యం గల ఆల్ టెరైన్ మోడల్ కారు ఎనిమిది సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రారంభమై గరిషఠంగా గంటకు 231 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎస్ యూవీ స్టైల్ రేడియటర్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్లాడెడ్ బంపర్‌తోపాటు పొడవైన తేలిక పాటి బరువు గల 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, సిల్వర్ డిఫ్యూజర్, క్రోమ్ టిప్డ్ డ్యుయల్ ఎక్సాస్ట్ పోర్ట్ అదనం. గ్లీ ఎస్ యూవీ, ఈ క్లాస్ సెడాన్ మోడల్ కార్లను పోలి ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios