న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ లైట్ కమర్షియల్ వెహికల్ ‘సూపర్ క్యారీ’లో ఫ్యూయల్ ఫిల్టర్‌లో లోపం వచ్చింది. దీంతో 5,900 యూనిట్లను రీకాల్ చేయాలని మారుతి సుజుకి మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య ఉత్పత్తి చేసిన వాహనాల్లో ఈ సమస్య తలెత్తినట్లు మారుతి సుజుకి నిర్ధారణకు వచ్చింది. 

బహిరంగ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ ఫిల్టర్ ఏర్పాటు చేసుకున్న వాహనాలను కూడా రీకాల్ చేయాలని మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది.  ‘ఈ నెల 26వ తేదీ నుంచి మారుతి సుజుకి డీలర్లను సంప్రదించిన సూపర్ క్యారీ వెహికల్స్ యజమానులు.. వాటిల్లో ఫ్యూయల్ ఫిల్టర్‌ను ఉచితంగా రీప్లేస్‌మెంట్ చేస్తాం’ అని మారుతి సుజుకి తెలిపింది. 

తమ సూపర్ క్యారీ వాహనాల వినియోగదారులు ఫిల్టర్ ఫ్యూయల్ రీప్లేస్‌మెంట్ కోసం కంపెనీ వెబ్ సైట్ marutisuzuki.comను సందర్శించాలని సూచించింది. 
ఎంఎ3తోపాటు 14 ఆల్పాబెటిక్ నంబర్లను నింపాలి. మరోవైపు తమ వెహికల్ కు రీప్లేస్ మెంట్ అవసరమా? కాదా? అన్న విషయమై కంప్యూటర్ స్క్రీన్ పై తెలుసుకోవాలి. ఈ చాసిస్ నంబర్.. వెహికల్ ఐడీ ప్లేట్, వెహికల్ ఇన్ వాయిస్, రిజిస్ట్రేషన్ పత్రాలను చేర్చాల్సి ఉంటుంది. ఈ రీకాల్ క్యాంపెయిన్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సాగుతోందని మారుతి సుజుకి తెలిపింది.