Asianet News TeluguAsianet News Telugu

హ్యుండాయ్ శాంత్రో మరో రికార్డు: 22 రోజుల్లో 28వేలు దాటిన బుకింగ్స్

హ్యుండాయ్ శాంత్రో మోడల్ కారు రికార్డుల వర్షం కురిపిస్తోంది. కేవలం 22 రోజుల్లోనే 28,800 కార్లను బుకింగ్స్ నమోదు చేసుకున్నది. గత నెల 10వ తేదీన బుకింగ్స్ నమోదు ప్రారంభమైన తొమ్మిది రోజుల్లో 14 వేలకు పైగా బుకింగ్స్ తో తొలి రికార్డు నమోదు చేసింది. మార్కెట్లోకి ఆవిష్కరించే నాటికి 23,500 బుకింగ్స్.. తాజాగా 28,800 బుకింగ్స్‌తో మరో రెండు రికార్డులు నమోదు చేసింది.

Hyundai Santro Bags 28,800 Bookings In Just 22 Days
Author
Hyderabad, First Published Nov 3, 2018, 12:57 PM IST

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ గత నెల 10వ తేదీన మార్కెట్లోకి ఆవిష్కరించిన ‘శాంత్రో’ మోడల్ కారు వరుస రికార్డులు స్రుష్టిస్తోంది. తొలి తొమ్మిది రోజుల్లో 14 వేలకు పైగా బుకింగ్స్ నమోదు చేసింది. మార్కెట్లో ఆవిష్కరించే నాటికి బుకింగ్స్ సంఖ్య 23,500 నమోదయ్యాయి. తాజాగా 22 రోజుల గడువులోగా 28,800 బుకింగ్స్ రికార్డయ్యాయి. ఇలా మార్కెట్లో ఆవిష్కరించిన 22 రోజుల్లోనే 28,800 బుకింగ్స్ నమోదు కావడం ఇదే రికార్డు. హ్యుండాయ్ శాంత్రో అక్టోబర్ 23వ తేదీన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. 

న్యూ 2018 హ్యుండాయ్ శాంత్రో మోడల్ ధర రూ.3.89 లక్షలతో ప్రారంభమై రూ.5.45 లక్షల వరకు పలుకుతోంది. ‘డీ-లైట్’, ‘ఎరా’, ‘మాగ్నా’, ‘స్పోర్ట్జ్’, ‘ఆస్టా ట్రిమ్’ మోడల్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మాగ్నా, స్పోర్ట్జ్ మోడల్ కార్లు సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుండగా, మిగతా కార్లు పెట్రోల్ వేరియంట్లలోనే అందుబాటులో ఉన్నాయి. 

1.1 లీటర్, 4- సిలిండర్ ఇంజిన్, 69 బీహెచ్పీతోపాటు 99 ఎన్ఎం పీక్ టార్చ్ కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ప్లస్ ఆప్షనల్ 5- స్పీడ్ ఎఎంటీ యూనిట్ కూడా డెవలప్ చేసింది హ్యుండాయ్. సీఎన్జీ వర్షన్ మోడల్ కారులో 59 బీహెచ్పీ, 84ఎన్ఎం పీక్ టార్చ్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ మోడల్ కారులో మాన్యువల్ అండ్ ఏఎంటీ గైజ్, ఫ్యూయల్ ఎఫిసియెంట్ లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్ కార్లు 20.3 కి.మీ, సీఎస్జీ వేరియంట్ కారు 30.48 కి.మీ. మైలేజీనిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios