కోఠి విమెన్స్ కాలేజీలో నిన్న సింగిల్ డే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో సుమారు 250 మంది విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులు టీకా వేసుకున్నారు. రొటారాక్ట్ క్లబ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజీ ఫర్ విమెన్, తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ డ్రైవ్ నిర్వహించారు.