Bala Raju Telika

telikabalaraju17@gmail.com
Bala Raju Telika

తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.

  • Area of Expertise:రాజకీయాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్
  • All
  • 90 NEWS
  • 71 PHOTOS
161 Stories by Bala Raju Telika
Asianet Image

Andhra Pradesh: ప‌ది ఫ‌లితాలు వాట్స‌ప్‌లోనే.. 23న విడుదల.. వెంటనే ఈ నంబర్‌ సేవ్‌ చేసుకోండి!

Apr 20 2025, 09:41 PM IST

Andhra Pradesh:ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 23న ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్‌ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మీడియం నుంచి 5.64 లక్షల మంది... తెలుగు మీడియం వారు 51069 మంది పరీక్షలు రాశారు. మార్చి17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వ‌ర‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాత వెంట‌నే మూల్యాంక‌న ప్ర‌క్రియ ప్రారంభించారు. 
 

Asianet Image

AP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!

Apr 20 2025, 06:18 PM IST

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సుధీర్గంగా నలభై ఏళ్లుపాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా.. నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్‌ అని పేరుంది, పాలన అందించే విషయంలో ఆయనకు మన, తన భేదాలు ఉండవు.. ఎమెషన్స్‌ ఉండవ్‌.. తప్పు చేస్తే ఎవరినైనా, ఎంతటివారినైనా ఎదిరిస్తారు, శిక్షిస్తారు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో మాట్లాడుతుంటారు.. పనిచేస్తుంటారు.. జూ.ఎన్టీఆర్‌ ఓ సినిమాలో చెప్పినట్లు అదోరేర్‌ పీస్‌ అన్నమాట. ఇక ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మొదలుకుని పవన్‌ కల్యాణ్, రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌, తదితర కీలకనేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.. అంతేకాకుండా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నారంటే.. 
 

Asianet Image

Betting App: ఉప్పల్‌ బాలు బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేయలేదో తెలుసా? రూ. 30లక్షలు ఇస్తే వద్దన్నాడట!

Apr 20 2025, 04:48 PM IST

Betting App: సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్‌ బాలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టిక్‌టాక్‌ వీడియోల నుంచి ఫేమస్‌ అయిన బాలు.. తన డ్యాన్స్‌ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ.. నవ్వులు పూయిస్తుంటాడు. ఇప్పటికే అనేక యూట్యూబ్‌ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రీసెంట్‌గా బాలు మాట్లాడుతూ.. తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతోపాటు బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు... తను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విన్న తర్వాత ఉప్పల్‌ బాలు మీద అందరికీ రెస్పెక్ట్‌ పెరిగిపోయింది. 

Asianet Image

TTD: టీటీడీలో భారీగా హిందూయేతర ఉద్యోగుల తొలగింపు.. 200 మందికి పైగానా? వారికి న్యాయం చేస్తామంటున్న ఛైర్మన్‌!

Apr 19 2025, 08:17 PM IST

TTD: తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్‌ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు. 

Top Stories