Bala Raju Telika

telikabalaraju17@gmail.com
Bala Raju Telika

తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.

  • Area of Expertise:రాజకీయాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్
  • All
  • 90 NEWS
  • 71 PHOTOS
161 Stories by Bala Raju Telika
Asianet Image

Mark Shankar: పవన్‌ అభిమానుల పూజలు ఫలించాయి.. చేతులు జోడించి థ్యాంక్స్‌ చెప్పిన శంకర్‌.. హెల్త్‌ అప్డేట్‌ ఇదే!

Apr 09 2025, 05:42 PM IST

Mark Shankar: పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. సింగపూర్‌కి సమ్మర్‌ క్యాంపు కోసం వెళ్లిన మార్క్‌ శంకర్‌ అక్కడి పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్‌ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో తొలుత కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈవిషయం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి పవన్‌ కల్యాణ్‌, మెగస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సింగపూర్‌ వెళ్లారు. మరోవైపు పవన్‌ అభిమానులు, జనసేన క్యాడర్‌ అనేక ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే.. 
 

Asianet Image

Manoj: కూతురు, భార్య బట్టలు, నగలు, కార్లు చోరీ.. కన్నీళ్లతో రేవంత్‌ రెడ్డికి రిక్వెస్ట్‌.. ఏందిరయ్యా ఈ రచ్చ!

Apr 09 2025, 04:32 PM IST

Manoj: మంచు మనోజ్‌, విష్ణుకి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. గతంలో మనోజ్‌ ఇంటికి కరెంట్‌ సరఫరా కట్‌ చేయడం, నీళ్ల మోటార్‌లో పంచదార వేయడం వంటివి విష్ణు చేస్తున్నాడని మనోజ్‌ ఆరోపించాడు. రీసెంట్‌గా తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఇద్దరి మధ్య ఘర్షన జరిగి కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఇక తాజాగా మనోజ్‌ ఉంటున్న ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో విష్ణు తన మనుషులను పంపి.. తన చిన్న పాప నగలు, బట్టలు, భార్య కార్లను ఎత్తుకెళ్లారని మనోజ్‌ ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఇద్దరూ చిన్నపిల్లల్లా రోడ్డుపైకి వచ్చి ఎందుకు గొడవలు పడుతున్నారో మీకు తెలుసా.. 
 

Asianet Image

NTR-Prashanth Neel: ఎన్టీఆర్‌, నీల్‌ చిత్రంపై బిగ్‌అప్డేట్‌.. షూటింగ్‌ డేట్‌ ఫిక్స్‌, రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Apr 09 2025, 02:03 PM IST

NTR-Prashanth Neel: యంగ్‌ టైగర్‌ జూనియర్‌ యన్టీఆర్‌తో కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తీయబోయే సినిమాకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో స్టోరీ దగ్గరి నుంచి నటీనటుల ఎంపిక, యాక్షణ్‌ సీక్వెన్స్‌కి పనిచేసే టెక్నీషియన్లు ఇతర అంశాలపై దర్శకుడు పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారంట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వార్‌-2 సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆ చిత్రంలో హృతిక్‌ రోహన్‌ హీరోగా ఎన్టీఆర్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రశాంత్‌ నీల్‌ చిత్రానికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. 
 

Asianet Image

ys jagan: చొక్కా ఊడదీయడానికి నువ్వెవడంటూ జగన్‌కి ఎస్సై స్ట్రాంగ్‌ రిప్లై.. జగన్‌ టార్గెట్‌ పోలీసులేనా?

Apr 09 2025, 12:53 PM IST

ys jagan: ఏపీలో కూటమి పార్టీ నాయకులకు, అటు వైసీపీ నేతలకు మధ్య గత కొంతకాలంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గొడవల్లో రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగమయ్య అనే వైపీసీ నాయకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు సర్కారు, పోలీసులు తీరుపై తీవ్రస్థాయిలో జగన్‌ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు పక్కనపెడితే.. జగన్‌ మాట్లాడిన తీరుపై ఓ ఎస్సై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే? 
 

Asianet Image

Swiggy Max Saver: స్విగ్గీ సంచలన నిర్ణయం.. అలా సరుకులు కొంటే బంపర్‌ ఆఫర్‌.. డబ్బు ఆదా ఎంతంటే?

Apr 09 2025, 10:33 AM IST

Swiggy Max Saver: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారుల కోసం బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చేసింది. ఇప్పటికే ఫుడ్‌ డెలివరీతోపాటు నిత్యావసర సరుకులను కూడా స్వీగ్వీ అందిస్తోంది. వీటితోపాటు సుమారు 35,000 రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు మరో జెప్టో సంస్థ సూపర్‌ సేవర్‌ అనే పేరుతో రోజుకో ఆఫర్‌ని ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్లో ఈ పోటీని తట్టుకునేలా స్విగ్వీ కూడా మ్యాక్స్‌ సేవర్‌ పేరుతో బంపర్‌ ఆఫర్‌, వినియోగదారులకు మెరుగైన రవాణా సదుపాయంతోపాటు భారీ డిస్కౌంట్‌లు ఇచ్చేందుకు సిద్దమైంది. మరి ఆఫర్‌ ఎవరికి వర్తిస్తుంది? ఆఫర్‌ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? 

Asianet Image

pawan kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జగన్‌, రోజా ట్వీట్లు.. షాక్‌లో క్యాడర్‌.. అంటే మీరు మీరు!

Apr 08 2025, 06:02 PM IST

pawan kalyan vs ys jagan: సింగపూర్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌ ప్రత్యేక విమానంలో వైజాగ్‌ నుంచి సింగపూర్‌ బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్‌ కుమారుడు కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అయితే పవన్‌ పేరు ఎత్తగానే ఉవ్వెత్తున ఎగసిపడే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతలు పవన్‌ కుమారుడు కోలుకోవాలని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. అవి చూసిన క్యాడర్‌ ఏమనుకుంటుందంటే... 

Asianet Image

ICON STAR ALLU ARJUN: బన్నీ అంటే నేషనల్‌ కాదు.. ఇంటర్నేషనల్‌.. అల్లు-అట్లీ మూవీతో హాలీవుడ్‌కి తగ్గేదేలే!

Apr 08 2025, 01:48 PM IST

ICON STAR ALLU ARJUN: పుష్పరాజ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. పుష్ప-2 ద రూల్‌లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ రికార్డులను షేక్‌ చేసిన బన్నీ..  అతపే తదుపరి నటించబోతున్న సినిమాకు సంబంధించి వీడియోను ఆ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. రీసెంట్‌గా అర్జున్‌ స్నేహితుడు బన్నీ వాసు కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. ముందు చెప్పినట్లుగానే ఆ సర్‌ప్రైజ్‌ మామూలుగా లేదు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్‌ గర్వపడేలా కాదు.. ఇండియన్‌ సినిమా గర్వపడేలా సినిమా ఉండబోతున్నట్లు విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఐకాన్‌ స్టార్‌ తర్వాత చిత్రం విశేషాలు తెలుసుకుందామా!!! 

Asianet Image

pawan kalyan: తన బిడ్డను వదిలేసి.. అడవి బిడ్డల కోసం పవన్‌ త్యాగం.. షాక్‌కి గురైన లోకేష్‌?

Apr 08 2025, 12:25 PM IST

Pawan kalyan: సినిమాలు చేయడంలో డైలాగులు చెప్పడంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ లెక్కుందని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రూవ్‌ చేస్తున్నారు. సింగపూర్‌లో చదువుకుంటున్న అతని చిన్న కుమారుడు అగ్నిప్రమాదం బారిన పడి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాధారణంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పవన్‌ హుటాహుటిన ప్రత్యేక విమానంలో సింగపూర్‌ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్‌ ఇచ్చిన మాట కోసం నిలబడిపోయారు. దీనిపై మంత్రి నారా లోకేష్‌, గిరిజనులు, జనసేన నాయకులు ఏమంటున్నారో తెలుసా?  

Asianet Image

AI: ఏఐతో స్వర్గం నుంచే వీడియో షూట్‌.. పెళ్లిళ్లలో ఏడిపించడమే నయా ట్రెండ్‌.. ఖర్చు ఎంతంటే?

Apr 07 2025, 11:07 PM IST

artificial intelligence: అనుకోని సంఘ‌ట‌న‌ల్లో పేగుబంధం పంచిన అమ్మానాన్న‌లు చ‌నిపోవ‌డం, ప్ర‌మాద‌వ‌శాత్తు రక్తం పంచుకుని పుట్టిన అన్న‌య్యా, త‌మ్ముడు, అక్క‌, చెల్లి దూరం అవడం. మమకారం, ఆప్యాయతలు పంచిన అమ్మమ్మ‌, నాన‌మ్మ‌, తాత‌య్య‌లు లేకపోవడం ఎంతో బాధాకరం కదా.. అయితే వీరందరూ తిరిగి ప్ర‌త్య‌క్షం అయితే.. మ‌నం త‌ట్టుకోగ‌ల‌మా..? అలాంటిది శుభకార్యం వేళ మన నుంచి దూరం అయిన వారు వచ్చి ఆశీర్వ‌దిస్తే.. ఆ క్ష‌ణం ఎవ‌రికైనా మాటలు వస్తాయా... కంట్లో నుంచి నీరు తప్పా.. ఇలాంటి దృశ్యాలను ఏఐతో సాధ్యం చేస్తున్నారు నేటి ఫొటో గ్రాఫర్లు. ఏఐ వినియోగించి చనిపోయిన వారందరినీ వీడియో రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. అసలు దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసుకుందామా మరి?