Bala Raju Telika

telikabalaraju17@gmail.com
Bala Raju Telika

తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.

  • Area of Expertise:రాజకీయాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్
  • All
  • 90 NEWS
  • 71 PHOTOS
161 Stories by Bala Raju Telika
Asianet Image

Duvvada Suspended from YSRCP: దువ్వాడను ముంచిన ఆ రెండు కారణాలు.. మాధురీ ప్రేయసి కాదు.. విలనే!

Duvvada Suspended from YSRCP: చిలక కొట్టుడు కొడితే చిన్నదానా.. పలకమారిపోతావే పడుచుదానా అని హీరో అంటే.. రాటుదేలి పోయావు నీటుగాడా.. నీ నాటు సరసం చాలులే పోటుగాడా అని హీరోయిన్‌ బదులిస్తుంది.. ఇది ఓ పాత పాటలో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయట్‌ సాంగ్‌. అయితే.. సరిగ్గా ఇలాంటి పాటలే దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాడుకున్నారు. ఇప్పుడు మాత్రం కథ రివర్స్‌ అయ్యింది. దువ్వాడకు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న చందంగా పరిస్థితి మారింది. ఏదైనా మూడో కంటికి తెలియకుండా సాగినంత కాలం పర్వాలేదు. ఒక్కసారి బయటపడిన తర్వాత.. జాగ్రత్త పడాలి లేదా అయినోళ్లతో కాళ్ల బేరానికి వెళ్లాలి. ఇవేమీ శీను చేయలేదు. అందుకే సీన్‌ రివర్స్‌ అయ్యింది. దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన ఆ రెండు తప్పులే అతని ఆల్‌మోస్ట్‌ రాజకీయ జీవితానికి రెడ్‌ కార్డు పడేలా చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
 

Asianet Image

AP Liquor Scam: ఎవరీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? లిక్కర్‌ స్కాంలో పాత్రేంటి.. బిగ్‌బాస్‌ పనేనా?

AP Liquor Scam: రాజకీయం.. వ్యాపారాం.. రెండూ ఓ తాను ముక్కలే.. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. అయితే.. రాజకీయమైనా.. వ్యాపారమైనా పద్దతిగా చేస్తే బాగుంటుంది.. లేదంటే దివాలా తీయాల్సి వస్తుంది. దేనికైనా కక్కుర్తి పడకూడదు అంటారు. కానీ ఏపీ లిక్కర్ స్కాంలో జరిగింది ఇదే. అత్యాసకు పోయి అడ్డంగా బుక్కయ్యారు. చివరికి బిగ్‌బాస్‌కు ఈ మద్యం స్కాం చుట్టుకునేలా ఉంది. ఈ విషయం పక్కన పెడితే.. ఈ స్కాంలోకి ఓ కొత్త పేరు వచ్చింది.. అదే కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి.. అసలు ఎవరీ కసిరెడ్డి.. గత వారం పది రోజులుగా ఏపీ ప్రజలకు అర్థం కావడం లేదు. ఇతనికీ ఈ స్కాంకు ఏంటి సంబంధం.. ఎక్కడి వ్యక్తి.. బిగ్‌బాస్‌కు ఎలా దగ్గరయ్యాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 
 

Asianet Image

Sri Reddy- AP Police: శ్రీరెడ్డిపై సింపతీనా? ఆ ప్లేస్‌లో మగాడుంటే ముసుగేసేవారేమో?

Sri Reddy- AP Police: సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేసేవారిని ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వైసీపీకి అనుకూలంగా పనిచేసిన, మాట్లాడిన సినీనటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూటమి పార్టీ మద్దతుదారుడు, ఐ టీడీపీ కార్యకర్తను సైతం మాజీ సీఎం జగన్‌ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు అతని ముఖానికి ముసుగు వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా సినీ నటి శ్రీరెడ్డిని కూడా పోలీసులు విచారణకు పిలిచి వదిలేశారు. ఈ విషయం సామాజిక మాద్యమాల్లో చర్చకు దారితీసింది. 

Asianet Image

అమ్మాయిలు పొట్టిగా ఉంటేనే అబ్బాయిలు ఇష్టపడతారట.. ఎందుకో తెలుసా?

పొట్టి పిల్లా... పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్ల... పొట్టి పిల్ల... ఓయ్ పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల.. అని బలగం సినిమాలో హీరో ప్రియదర్శి కావ్య కల్యాణ్‌ రామ్‌ను చూసి తన ప్రేమను తెలియజేస్తుంటారు. మరికొన్ని సినిమాల్లో పొట్టి.. పొట్టి అని ముద్దుగా ప్రేయసిని హీరోలు పిలిచిన సందర్బాలు కూడా చూశాం. వాస్తవానికి కూడా పొట్టిగా ఉండే అమ్మాయిలనే ఎక్కువ శాతం మంది అబ్బాయిలు ఇష్టపడతారంట. పొట్టిగా ఉండే మహిళలు, అమ్మాయిల పట్ల పురుషులు ఎందుకు ఆకర్షితులవుతారు? దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయంటండి.. ఓ అధ్యయనంలో కూడా సంచలన విషయాలు వెల్లడయ్యాయంట.. అవేంటో మీరు తెలుసుకుంటారా? 

Top Stories