Chanakya Niti: కష్టపడే ప్రతీ ఒక్కరూ జీవితంలో అన్నింటా విజయం సాధించాలని.. ధనవంతులు కావాలని కోరుకుంటారు. మరి అలా అవ్వాలంటే ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అని నీతిశాస్త్రంలో ఉంది. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలంటే ఈ ఐదు నియమాలు పాటించండి.
చాణక్యనీతిలో ఏముందంటే:
ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. రాజకీయ మేధావి కూడా. ఆయన తన నీతిశాస్త్రంలో పొందుపరిచిన జీవిత సూత్రాలను ఇప్పటికీ సమాజం ఆచరిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఇప్పటికీ మన జీవిత విధానంలో భాగమై ఉంటాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి.? ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి.? డబ్బు ఏ విధంగా సంపాదించకూడదు.? విజయం దక్కాలంటే పాటించాల్సిన నియమాలు.? లాంటి వాటి గురించి ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఇక జీవితాంతం విజయం మన సొంతం అవ్వాలంటే పాటించాల్సిన నియమాల గురించి ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందామా..
సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి:
ఎలప్పుడూ విజయాలు అందుకునే వ్యక్తులు సమయాన్ని గౌరవిస్తారు. ప్రతీ విషయంలోనూ టైంను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలని.. అదే మనిషికి లభించే గొప్ప సంపద అని చాణక్యుడు చెప్పారు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా.. వచ్చిన అవకాశాన్ని, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయపాలన, ప్లానింగ్, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వంటి చిన్న అలవాట్లు మీ విజయానికి సోపానాలు అవుతాయని ఆచార్య చాణక్యుడు అన్నారు.
తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి:
తొందరపాటు నిర్ణయాలు జీవితానికే చేటు.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి, తెలివిగా నిర్ణయాన్ని తీసుకోవాలి. చాణక్యుడి ప్రకారం, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు వారి అనుభవం, జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. అదేవిధంగా మనం కూడా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు అన్నారు.
స్నేహితులు, రిలేషన్‌షిప్ మ్యాటర్స్:
ప్రతి క్షణం మీ పనిపైనే దృష్టి సారించాలి. అలాగే స్నేహానికి, బంధాలను గౌరవించాలి. మన చుట్టూ ఉండే మంచి స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు మన విజయాన్ని రెట్టింపు చేస్తారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ మంచి వ్యక్తులను చుట్టూ ఉంచుకోవాలి.
డబ్బు, వనరుల సరైన నిర్వహణ:
ఇప్పటికే విజయం సాధించిన వ్యక్తులు తమ డబ్బు, వనరులను తెలివిగా వినియోగించుకుంటారు. చాణక్యుడి ప్రకారం, సరైన వనరుల నిర్వహణ దీర్ఘకాలిక విజయాలకు వారధిలా ఉంటాయి. మీరు కూడా విజయం, సంపద సాధించాలనుకుంటే అనవసరమైన మేరకు ఖర్చులు చేయడమే కాకుండా.. సరైన పద్దతుల్లో డబ్బులను దాచుకోవడానికి ప్రయత్నించాలి.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓపికగా ఉండాలి:
విజయవంతమైన వ్యక్తులు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓపికగా ఉంటారు. సంక్షోభ సమయాల్లో ఓర్పు, పట్టుదల ఒక వ్యక్తిని బలంగా మారుస్తాయని చాణక్యుడు అన్నారు. మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నా ఓపికగా ఉండాలి. మీరు ఎదుర్కునే సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలి.


