MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు

June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు

June Horoscope: జూన్ నెలలో సూర్యుడి కొన్ని రాశుల వారికి కలిసొచ్చే కాలాన్ని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మూడు రాశుల వారికి అపారమైన అదృష్టం, పురోగతి లభించబోతున్నాయి. వీరికి కెరీర్ పరంగా, డబ్బు, కుటుంబ సంతోషం వంటి విషయాల్లోనూ మంచి మార్పులు సంభవిస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 22 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూన్ లో ఈ రాశులదే హవా
Image Credit : Asianet News

జూన్ లో ఈ రాశులదే హవా

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడి మంచి స్థానంలో ఉంటే అధికారం, కీర్తి, ధనలాభం దక్కుతాయి. రాబోయే జూన్ నెలలో సూర్యుడి స్థానంలో మార్పు రాబోతోంది. దీనివల్ల 3 రాశుల వారికి అద్భుతమైన పురోగతిని, అదృష్టం దక్కబోతోంది.  సూర్యుడి ప్రత్యక్ష దృష్టి మూడు రాశులపై పడటం వల్ల  ఇప్పటివరకు తడబడుతున్న వారి జీవితం ఒక్కసారిగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. డబ్బు విపరీతంగా సంపాదించే అవకాశం ఉంది.  ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది.  ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

జూన్ నెల వృషభ రాశి వారికి బాగా కలిసొస్తుంది.  వారి జీవితంలో మంచి మార్పులు మొదలవుతాయి. వీరిపై సూర్యుడి అనుగ్రహం  ఉంటుంది.  కాబట్టి వీరు కెరీర్‌లో, ఆర్థిక విషయాల్లో అద్భుతమైన పురోగతిని చూస్తారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశం మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, పెట్టుబడులు మంచి లాభాలు కూడ చేతికి అందుతాయి.  కుటుంబంలో మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. జూన్ నెలలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.

34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి జూన్ నెల స్వర్ణ యుగమనే చెప్పుకోవాలి. వీరు ప్రయత్నించిన అనేక పనుల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ అనుకూలంగా పూర్తవుతాయి. అధికారం, పలుకుబడి వస్తాయి. జూన్ నుంచి ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్ధికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించే యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు కూడా వీరికి మిత్రులు అయిపోతారు. 

44
ధనుస్సు
Image Credit : Getty

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి సూర్యుడి వల్ల ఊహించని అదృష్టం, ధనలాభం కలగబోతోంది. విదేశీ అవకాశాలు, కొత్త వ్యాపార ప్రయత్నాలు వస్తాయి. పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ నెల నుంచి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అప్పులు తగ్గి పొదుపు అనేక రెట్లు పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడ ఉంది. జూన్ నుంచి వీరి జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?
Recommended image2
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved