నూతన సంవత్సరంలో కుంభరాశి వారి రాశిఫలాలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Jan 2019, 10:36 AM IST
new year..horoscope of aquarius in 2019
Highlights

ఈ నూతన సంవత్సరంలో కుంభరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ద్వితీయ లాభాధిపతి గురుడు థమంలోనూ,  లగ్న వ్యయాధిపతి శని లాభంలోనూ, షష్ఠంలో రాహువు,  వ్యయంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత పంచమంలో రాహువు, దశమంలో కేతువు ఉంటారు.

వీరికి చేసే పనుల్లో శ్రమను కలిగిస్తాడు. చాలా ఒత్తిడి ఉంటుంది. లాభాల ద్వారా సమాజంలో గౌరవాన్ని పెంచుకుటాంరు. గుర్తింపుకోసం ఆరాటపడతారు. మాటలవల్ల గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెంచుకుటాంరు. నిల్వ ధనాన్ని పెంచుకుటాంరు. చేసే అన్ని పనుల్లో శారీరక శ్రమ ఉంటుంది. కళాకారులకు అనుకూలత పెరుగుతుంది.

తాను చేసే శ్రమవల్ల లాభాలు పెంచుకుటాంరు. విశ్రాంతిని కోల్పోతారు. అనవసర వ్యయం ఉంటుంది. దూర ప్రయాణాలు  చేసే ఆలోచనలు ఉంటాయి. కళాకారులకు అనుకూలత ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఉపాసనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు పెడితేనే వీరికి ఆదాయం ఉంటుంది. లాభాలు ఉపయోగపడతాయి.

వీరికి పోీల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. శత్రువులు పెరిగే సూచనలు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శారీరక బలం తగ్గేట్లు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మార్చి తర్వాత నుంచి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్త వహించాలి.

మాటలవల్ల ఇబ్బందులు ఉంటాయి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. దీనివల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు.  ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం. శారీరక శ్రమ ఉంటుంది. తాను చేసే పనుల వల్ల తమకే ఇబ్బందులు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. మార్చి తర్వాత నుంచి సహకారం వల్ల నిరాశ నిస్పృహలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్‌ వల్ల శ్రమ పెరుగుతుంది.

వీరు పవుపక్షాదులకు ఆహారం వేయడం, నీరు పెట్టడం, యోగా ప్రాణాయామాలు చేయడం, వాకింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. గురువులను సత్కరించుకోవాలి. విద్యార్థులకు పుస్తకాలు పంచిప్టోలి. శనగలు, దానం చేయాలి.  పసుపురంగు, నీలిరంగు, చిత్రవర్ణం వస్త్రాలను దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో తులరాశి వారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో వృశ్చిక రాశివారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో మకరరాశి వారి రాశిఫలాలు

loader