న్యూ ఇయర్ లో మకరరాశి వారి రాశిఫలాలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Jan 2019, 10:24 AM IST
new year..horoscope of capricorn in 2019
Highlights

ఈ సంవత్సరం మకర రాశివారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : తృతీయ వ్యయాధిపతి గురుడు లాభంలోనూ, లగ్న, ద్వితీయాధిపతి శని వ్యయంలోనూ, సప్తమంలో రాహువు, లగ్నంలో కేతు వు ఉన్నారు. మార్చ్‌ తర్వాత షష్ఠంలో రాహువు, వ్యయలో కేతువు ఉంటారు.

ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు చికాకు పెడతాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అపార్థం చేసుకునే అవకాశం ఉంది. బాహ్య మౌనం, అంతర మౌనాన్ని వీరు ప్రయత్నం చేయాలి. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాలు విస్తరించే ప్రయత్నం చేసుకోవాలి.

లాభాలు రావాలంటే ఖర్చు ప్టోలి. ఖర్చులు ఆధ్యాత్మికపరమైనవి అయి ఉండాలి. అప్పుడే వచ్చే లాభాలు సంతృప్తినిస్తాయి.  పెద్దల సహకారాలు లభిస్తాయి. పెద్దలతో కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఎన్ని పనులు చేసినా లోపల ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. జాగ్రత్త వహించాలి.

సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలించవు. కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లోకి వెళ్ళకూడదు. మార్చితర్వాత నుంచి అనారోగ్య సూచనలు ఉంటాయి. పోీల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు.

అనుకోని నిరాశ, నిస్పృహలు ఉంటాయి. చేసే పనుల్లో ఉత్సాహం తగ్గుతుంది. పనులు మొదలు ప్టోలంటేనే ఆలోచన పెరుగుతుంది. మార్చి తర్వాత నుంచి అనవసర ఖర్చులు ఉంటాయి. శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. వాటి ని కాపాడు కునే ప్రయత్నం చేయాలి. విశ్రాంతి కూడా లోపిస్తుంది.

వీరు పవుపక్షాదులకు ఆహారం వేయడం, నీరు పెట్టడం, యోగా ప్రాణాయామాలు చేయడం, వాకింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. గురువులను సత్కరించుకోవాలి. విద్యార్థులకు పుస్తకాలు పంచిప్టోలి. శనగలు, దానం చేయాలి.  పసుపురంగు, నీలిరంగు, చిత్రవర్ణం వస్త్రాలను దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో తులరాశి వారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో వృశ్చిక రాశివారి రాశిఫలాలు

loader