తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : తృతీయ షష్ఠాధిపతి గురుడు ద్వితీయంలో, చతుర్థ పంచమాధిపతి శని తృతీయంలో, థమంలో రాహువు, చతుర్థంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత నవమంలో రాహువు, తృతీయంలో కేతువు ఉంటారు.

మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాలు అనుకూలత ఏర్పడుతుంది. సహకారం కోసం ప్రయత్నిస్తారు. పోటీల్లో నిలబడడానికి ప్రయత్నిస్తారు. శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి.

సేవకుల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఏర్పడతాయి. తోటివారి సహకారాలు ఉంటాయి. దొరికిన సహకారం అనుకూలంగా ఉండదు. కొంత అసంతృప్తి ఉంటుంది. వీరు ఊహించిన రీతిలో ఏ పనీ జరుగదు. దగ్గరి ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి పెట్టాలి. సంతాన పరమైన సహకారం లభించదు. సంతానంకోసం ఆలోచించి కొంత ఒత్తిడిని పెంచుకుంటారు. సౌకర్యాలుకూడా ఒత్తిడితో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వీరికి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.  ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. వ్యర్థ ప్రయాణాల జోలికి వెళ్ళకూడదు. పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వీరికి దురాశ ఎక్కువగా ఉంటుంది. వీరికి కర్మ బాగా పెరుగుతుంది. కావున కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్న సౌకర్యాలు వీరికి సరిపోవు. కొత్త సౌకర్యాలు కావాలని ఆలోచిస్తూ ఉంటారు. వాటికోసం ప్రయత్నం చేస్తూ నిరాశ నిస్పృహలు పెంచుకుంటారు. తమకు అన్నీ ఆటంకాలే. ఎవరూ సమయానికి ఉపయోగ పడరు. ఏ వస్తువు కూడా తమకు అవసరానికి వినియోగంలోకి రాదు అనే నిరాశ నిస్పృహలు ఎక్కువౌతాయి. మార్చి తర్వాత నుంచి వీరు ఎదుటివారు సహకారం అందించినా కూడా తీసుకోవడానికి వీరు అనుకూలంగా ఉండరు. ఎదుటివారు తమ దగ్గర ఏమి ఆశించి సహకారం ఇస్తున్నారో అనే ఆలోచన కొంత పెట్టుకుంటారు.

ముఖ్యంగా పశుపక్షాదులకు ఆహారం పెట్టాలి, అలాగే గురువులకు, పెద్దలను సేవించుకుంటూ ఉండాలి. శివునికి అభిషేకం, అవసరార్థికి అవసరమైన వస్తువులు దానం చేయాలి. వాకింగ్‌ తప్పనిసరిగా చేయాలి. వీరు స్వ్స్‌టీ దానం చేయడం, చదువకునే పిల్లలకు పుస్తకాలు దానం చేయడం మంచిది.

మిగతా రాశులవారి కంటే కూడా తులారాశివారికి మొత్తం పై కొంత అనుకూలత ఉంటుంది. మిగతా రాశులవారి కంటే వీరికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అన్ని గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి కాని ఆ పరిహారాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉండనవసరం లేదు.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు