వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వీరికి అష్టమ లాభాధిపతి అయిన గురుడు సప్తమంలో, నవమ థమాధిపతి శని అష్టమంలో, తృతీయంలో రాహువు, నవమంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు ఉంటారు.

సామాజిక అనుబంధాలు విస్తరించాలని కోరుకుటాంరు. తమ కంటే పెద్దవారితో పరిచయాలు పెంచుకుటాంరు. పెట్టుబడులు విస్తరిస్తాయి. లాభాలు సద్వినియోగం చేస్తారు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు సంతోషకరంగా ఉంటాయి. ఎన్ని పనులు చేసినా ప్రతి పనిలోను అనుకున్నంత సంతోషం పొందలేరు. చేసే అన్ని పనుల్లో ఎంతో కొంత కోల్పోక తప్పదు. వీరు వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. వివాహం కానివారు కొంత అధిక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. కళాకారులకు అనుకూల సమయంగా ఉంటుంది.

అనారోగ్య సమస్యలుతీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. సేవకులతో కొంత కొంత అనుకూలత ఏర్పడుతుంది. వీరు పనిచేసే చోట తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి. తొందరపడి ఏ పనులు చేయకూడదు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది.

విద్యార్థులు చదువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వారి ఆలోచనలు వేరేవైపు వెళ్ళకుండా చూసుకోవాలి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. శ్రమ, కాలం, ధనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో అప్రమత్తత అవసరం. విద్యార్థులు ఎవరైనా చెపితే విని దానిని అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. తాము చదవడం కంటే వినడం ద్వారా వీరు ఎక్కువగా గ్రహించగలుగుతారు. మార్చి తర్వాత నుంచి మాటల్లో జాగ్రత్త అవసరం. వీరు మౌనాన్ని పాటించాలి. మా వల్ల అపార్థాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉంటాయి.

ఏ పనిచేసినా, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉంటుంది. అనుకున్నంత సంతృప్తి ఉండదు. ఎక్కువ ఆశలు, ఆశయాలు పెంచుకోకపోవడం మంచిది. దూర దృష్టి ఉంటుంది. ఊహలు అధికంగా ఉంటాయి. మాటలు కోటలు దాటుతాయి కాలు కడప దాటదు అనే సామెత వీరికి వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. మార్చి తర్వాత నుంచి ఊహించని ఇబ్బందులు ఎక్కువౌతాయి. దానాలు ఎక్కువగా చేయడం మంచిది.

ఈ రాశివారు బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టడం. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

"

read related news here..

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...