మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వీరికి నవమ వ్యయాధిపతి గురుడు అష్టమంలో, థమ లాభాధిపతి శని థమంలో చతుర్థంలో రాహువు, థమంలో కేతువు, మార్చ్‌ 2019 తర్వాత తృతీయంలో రాహువు నవమంలో కేతువు  వస్తారు.

వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తిచేసుకోలేరు. వాటికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. చేసే అన్ని పనుల్లో కూడా పూర్వపుణ్యం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ప్రమాదాలకు సూచనగా చెప్పవచ్చు. తమకంటే పెద్దవారితో జాగ్రత్తగా మెలగాలి. వారి అనుభూతులు ఎప్పికప్పుడు వింటూ, వారి జ్ఞానాన్ని పంచుకునే దిశగా వీరు ప్రయత్నం చేయాలి.  అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అధికంగా ఉంటుంది. సౌకర్యాలకోసం ఆలోచన పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగాదుల్లో అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా ఆలోచనలు సాగుతాయి. లాభాలు వచ్చినా అవి సద్వినియోగ పడవు. అనుకున్నంత స్థాయిలో తృప్తి ఉండదు. దానధర్మాలకు అధిక వ్యయం చేయడం మంచిది. పని చేయాలంటే కొంత బద్ధకం ఉంటుంది. బద్ధకాన్ని వదిలించుకొని ముందుకు సాగడం మంచిది. దూర ప్రయాణాల్లో ఆధ్యాత్మిక యాత్రలు చేయడం మంచిది. ఆధ్యాత్మిక యాత్రలు బాగా ఉపకరిస్తాయి.

అధిక శ్రమతో సౌకర్యాలను సంపాదించుకుటాంరు. గృహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికోసం చేసే ప్రయత్నాలు అధిక శ్రమను ఇస్తాయి. పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరించాలి. మార్చ్‌ తర్వాత నుంచి సహకారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఆలోచించి చేయాలి. కాలాన్ని, శ్రమను, ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి.

వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించడం మంచిది. పెట్టుబడులపై దృష్టి ఉంచకూడదు. విద్యార్థులు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు. కష్టపడినవాటికి ఫలితాలు రావు. నిరాశ, నిస్పృహలు వస్తూటాంయి. వాటిని అధిగమించి పనులు పూర్తి చేసుకోవాలి. మార్చి తర్వాత నుంచి వీరికి సంతృప్తి తక్కువగా ఉంటుంది. సేవలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దైవారాధన, దైవ కార్యక్రమాలు చేయడంమంచిది.

ఈ రాశివారు బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దక్షిణామూర్తి ఆరాధన,  ప్రత్యక్షంగా గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం చేయాలి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని ప్టోలి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

"