అమావాస్య రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు.. పెద్దలే కాదు, సైన్స్ కూడా ఇదే చెబుతోంది.

ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి వస్తుంటాయి. హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమావాస్య రోజు కొన్ని రకాల పనులకు చేయకూడదుని మన సంప్రదాయం చెబుతోంది. అయితే కేవలం ఆచారంగానే కాకుండా. అమావాస్య రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలని సైన్స్‌ సైతం చెబుతోంది.. 
 

Don't do these things on amavasya Astrology says VNR

ఈ పనులకు దూరంగా.. 

ప్రయాణాలు.. 

అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తుంటారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని పెద్దలు సూచిస్తుంటారు. 

కొత్త వస్తువులు కొనడం.. 

అమావాస్య రోజున కొత్త దుస్తులు కొనడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదుని చెబుతుంటారు. ఇది నెగిటివ్‌కు సూచికగా చెబుతుంటారు. అంతే కాకుండా ఎలాంటి కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదని పెద్దలు చెబుతుంటారు. 

కటింగ్‌, షేవింగ్‌.. 

అమావాస్య రోజున ఎట్టి పరస్థితుల్లో కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం కూడా నిశిద్ధమని చెబుతుంటారు. 

శుభకార్యాలు.. 

అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యక్రమాలు జరగవని మనిందరికీ తెలిసిందే. వివాహం మొదలు చిన్న చిన్న శుభ కార్యాలను కూడా అమావాస్య రోజున నిర్వహించారు. అంతేకాదు ఈ రోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు. 

తలకు నూనె రాయడం.. 

అమావాస్య రోజున తలకు నూనె అప్లై చేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. అలాగే అమావాస్య రోజున జుట్టు వదిలి తిరగకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు బయట తిరిగే సమయంలో జుట్టు ముడి లేదా జుట్టు వేసుకోవాలని చెబుతుంటారు. 

ఖర్చులు.. 

అమావాస్య రోజున వీలైనంత వరకు ఖర్చులు మానుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా వృధా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. 

మాంసాహారం.. 

అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు. శాస్త్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. వీలైనంత వరకు ఆకు కూరలను తినాలని అంటారు. 

భార్యాభర్తలు.. 

అమావాస్య రోజున భార్యభర్తలు శారీరకంగా కలవకూడదని శాస్త్రం చెబుతోంది. అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు. ఆలుమగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతుంటారు. 

సైన్స్‌పరంగా.. 

అయితే పైన తెలిపిన విషయాలన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే అని అభిప్రాయపడే వారు ఉంటారు. కానీ సైన్స్ పరంగా కూడా దీనికి ఒక లాజిక్‌ ఉందని చెబుతుంటారు. అటు జ్యోతిష్య శాస్త్రంతో పాటు, ఇటు సైన్స్‌ ప్రకారం చంద్రుడు మనిషి మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాడని చెబుతుంటారు. చంద్రుడు పూర్తిగా కనిపించని తరుణంలో మనిషి మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటారు. అందుకే అమావాస్య రోజున కొన్ని రకాల పనులకు దూరంగా ఉండాలని అంటారు. అయితే అమావాస్య రోజున పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం మంచిదని హిందూ శాస్త్రం చెబుతోంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిల ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios