Birth Date: నెంబర్ 3 కి చెందిన వారి లైఫ్ 2026లో ఎలా ఉండబోతోంది? కెరీర్ ఎలా మారబోతోంది?
Birth Date: మరి కొద్ది రోజుల్లో మనమంతా 2026లో అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ఎవరికి ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. మరి న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3 కి చెందిన వారికి ఎలా ఉంటుందో చూద్దాం

Number3
న్యూమరాలజీ ప్రకారం.. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. నెంబర్ 3 సంఖ్యకు గురు గ్రహం అధిపతి. ఈ సంవత్సరం ఈ తేదీల్లో జన్మించిన వారందరి జీవితంలోనూ చాలా మార్పులు రానున్నాయి.
కెరీర్, ఉద్యోగం...
2026లో నెంబర్ 3 కి చెందిన వ్యక్తుల కెరీర్ లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు లేదా బదిలీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి, తొందరపడి నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు సాగడతం మంచిది. మార్కెటింగ్, సేల్స్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా రంగానికి చెందిన వారికి ఫాలోవర్స్, పేరు, ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా లాభాలు వస్తాయి. అయితే... అతి ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యం వలన అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. కొంచెం సహనంగా ఉండాలి.
ప్రేమ, వైవాహిక జీవితం....
ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ జీవితం కోరుకున్నంత అనుకూలంగా ఉండకపోవచ్చు. భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కానివారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. కానీ, తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు.
ఆరోగ్యం....
ఈ తేదీల్లో పుట్టిన వారు ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. వీరు, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామం చేయాలి. సరిగా నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
ఈ తేదీల్లో పుట్టిన వారి..
అదృష్ట రంగులు: బంగారు, పసుపు, ఆకుపచ్చ
అదృష్ట సంఖ్యలు: 1, 5, 7
శుభ ఫలితాలను పెంచుకోవడానికి....
అవసరమైన వారికి దుప్పట్లు, చెప్పులు దానం చేయాలి.
రోడ్డుపై తిరిగే జంతువులకు ఆహారం పెట్టాలి.
ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా జపించాలి.

