జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం జూన్ 9న అస్తమించి.. జూలై 9న మిథున రాశిలో ఉదయించనుంది. దీనివల్ల శుభప్రదమైన 'ధనలక్ష్మి రాజయోగం' ఏర్పడనుంది. ఈ యోగం ఐదు రాశులవారికి కాసుల వర్షం కురిపిస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.    

జ్యోతిష్యం ప్రకారం నెల రోజుల పాటు గురు గ్రహం అస్తమయంలో ఉంటుంది. తిరిగి జూలై 9న మిథున రాశిలో ఉదయిస్తుంది. దీనివల్ల మిథునరాశిలో ధనలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మిథున రాశిలో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి శుభఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

ధనలక్ష్మీ రాజయోగం వల్ల ఏ రాశుల వారికి శుభం జరుగుతుంది?

మేషరాశి

ధనలక్ష్మి రాజయోగం ప్రభావంతో మేష రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అనుకూలం. పాత బకాయిలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంగారం, షేర్ మార్కెట్, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. అయితే ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది.  

కర్కాటక రాశి

ఈ రాశి వారికి గురు, బుధుల కలయిక చక్కని దిశానిర్దేశం చేస్తుంది. ఉద్యోగులక పదోన్నతి అవకాశాలున్నాయి. వ్యాపారులకు విదేశీ సంబంధాల ద్వారా లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్య, బ్యాంకింగ్, సేవా రంగాల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.

కన్య రాశి 

కన్య రాశివారికి ధనలక్ష్మి రాజయోగం వరం, శాపం రెండూ కావచ్చు. ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి ఉన్నప్పటికీ.. ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు మంచి సమయమే అయినా.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రియల్ ఎస్టేట్, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.  

తుల రాశి

తుల రాశి వారికి గురు, బుధుల కలయిక చాలా మంచిది. అన్ని రంగాల్లోనూ సానుకూలత, స్థిరత్వం ఏర్పడతాయి. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

మీన రాశి

ఈ రాశికి అధిపతి గురువు. కాబట్టి ఈ రాజయోగం మీన రాశి వారికి చాలా శుభప్రదం. ఈ సమయం మీన రాశి వారికి పురోగతి, విజయాలతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీ లేదా కొత్త ఉద్యోగం లభించవచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, పెద్ద కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.