పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రని ముఖం, చక్కని ముఖవర్చస్సు, సుందరమైన స్వరూపం, ఎప్పుడూ సంతోషంతో ఉంటూ కనిపిస్తారు. వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియవు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయోకూడా తెలియదు. తాము ఎప్పుడూ గుంభనంగా ఉంటారు.

 

కుంభరాశి సహజ లాభస్థానమై అందులో పాప గ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు పైన చెప్పిన విషయాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. తాము చేసే పనుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఉదా: ఏ పని చేసినా కలిసి రావడం లేదు - ప్రయోజనం లేదు - కార్యనిర్వహణలో శ్రమే ఉంటుంది కాని, లాభాలు లేవు - పెద్దల ఆశీస్సులు లభించడం లేదు - వారి అనుకూలత నా పట్ల లేదు - పొందదగిన లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యల్లో కూరుకుంటున్నాను మొదలైన ప్రశ్నలు లాభభావ లోపాల వల్ల కలిగే ఆలోచనలు, వేసే ప్రశ్నలు.

 

లాభాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, లాభంలో త్రిక స్థానాధిపతులున్నా, లాభాధిపతి, లాభస్థానం అశుభగ్రహాలతో, త్రికాధిపతులతో కూడి ఉన్నా, సంబంధాన్ని పొందినా, అష్టక వర్గులో దశమం కన్నా లాభంలో తక్కువ బిందువులున్నా, 24 కన్నా తక్కువ బిందువులున్నా, భిన్నాష్టక వర్గులో గ్రహం దశమం, వ్యయాలకన్నా తక్కువ బిందువుల నిచ్చినా, 4 కన్నా తక్కువ బిందువుల నిచ్చినా సాధారణంగా లాభ భావ లోపాలుగా పరిగణించాలి.

 

అందరి లాభాలను తాము దోచేసే ఉద్యోగాదులు చేయడం, ప్రక్కవాని శ్రమను తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా దోపిడి చేయడం, ఇతరులకు ఆనందం లేకుండా చేయడం, లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే విధమైన ప్రవర్తన, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యాదులతో నాశనం చేయడం వంటి పూర్వకర్మల వల్ల కలిగే లోపాలు లాభభావ లోపాలుగా కనిపిస్తాయి.

 

 జ్యోతిర్వైద్య ప్రక్రియలో ముఖ్యంగా ఆలోచనలు మార్చుకునే ప్రక్రియలో భాగంగా లోకానికి అందరికీ అన్ని రకాల ప్రయోజనాలు చేకూరాలి, శ్రమకు తగిన లాభాలు అందాలి, అందరూ లాభాలతో సంతోషంగా ఉండాలి, శారీరకంగా మానసికంగా అందరికీ మేలు చేకూర్చే ప్రయత్నం చేయడం వల్ల తాము పొందబోయే లాభాలు పరిపూర్ణంగా తాము అనుభవించే అవకాశం ఉంటుంది.

 

కర్మలను శుద్ధి చేసుకోవడానికి ఈ లోకానికి రావడమే లాభం, ఈ ప్రయోజనం కోసమే పరమాత్మకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉండడం, ఎవరు ఏ లాభాలు పొందుతున్నా అవి తమకే అందుతున్నంత ఆనందాన్ని పొందడం, ఎదుటివారి శ్రమకు తగిన ఫలితాలను అందించే ప్రయత్నం, వ్యాపారాదుల్లో అతి లాభాలను తగ్గించుకొనడం, వచ్చిన ప్రయోజనాలను మళ్ళీ సత్కార్యాచరణకోసం వినియోగించడం వల్ల లాభభావ లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.

 

ఈ శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ పూర్ణమైనవే. వీనితో ఏ పని చేసినా ఆనందమే కలుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలే ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల ప్రతి క్షణం ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నాను, లోకంలో అందరిలోనూ ఉన్న పరమాత్మ నాకు అందరి ద్వారా లాభాలను, మేలును, ప్రయోజనాలనే కలిగిస్తాడు అనే భావనల వల్ల లోప నివారణలకు అవకాశం ఉంది.

 

ఈ విధంగా దోషాలు తెలుసుకుని గుణాలు వృద్ధిచేసుకునే మార్గంలో ప్రయాణించాలి.

 

డా.ప్రతిభ

మరిన్ని వార్తలు చదవండి

మకర రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

ధనస్సు రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

వృశ్చికరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?