విజయవాడ: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల ఓట్లు మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. తాను చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసనని చెప్పుకొచ్చారు. 

తన జీవిత చరిత్ర తెరిచిన పుస్తకమని అందులో ప్రజాసేవ తప్ప ఎలాంటి మోసాలు గానీ నేరాలు గానీ ఉండవన్నారు. 2014 ఎన్నికల్లో ఎలా అయితే ఓటమి పాలయ్యారు రాబోయే ఎన్నికల్లో కూడా తన చేతిలో వైసీపీ అభ్యర్థి పీవీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. 

మరోవైపు పీవీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేశినేని నాని. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పీవీపీ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ ప్రజల మనోభవాలను అర్థం చేసుకోలేని నువ్వు విజయవాడలో ఏమి ఉద్దరిస్తావని ప్రశ్నించారు. 

పీవీపీ అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేసిన వ్యక్తి అని ఆరోపించారు. సెబీ కేసుల్లో ఇరుక్కుని దాక్కుంటున్న వ్యక్తి అంటూ ఆరోపించారు. జగన్ డబ్బును హవాలా చేసింది కూడా ఆయనేనంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ నైజం, పీవీపీ నైజం ఒక్కటేనని ఆరోపించారు. 

గత ఎన్నికల్లో తనపై ఎమ్మార్ కేసులో కోర్టులో జైలుకెళ్లిన వ్యక్తిని తనపై నిలబెట్టారని అతనిని విజయవాడ ప్రజలు తరిమితరిమికొట్టారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా పీవీపీని అలాగే తరిమికొడతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3లక్షల ఓట్లతో గెలవబోతున్నానని గెలిచి చరిత్ర సృష్టించబోతున్నట్లు స్పష్టం చేశారు కేశినేని నాని.  
 

ఈ వార్తలు కూడా చదవండి

హోదా బోరింగ్ సబ్జెక్ట్ అన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి పీవీపీ: సోషల్ మీడియాలో వీడియో వైరల్