హైదరాబాద్: తాను గెలిస్తే చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటారని... ఓటమిపాలైతే ఆ నెపాన్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నం చేస్తాడని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌తో కలిసి వినతి పత్రం సమర్పించిన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నికల్లో గెలిస్తే పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ను తానే నేర్పించానని చెప్పుకొంటాడన్నారు.

బిల్‌గేట్స్‌కు కంప్యూటర్‌ను కూడ తానే నేర్పించానని .... సెల్‌ఫోన్‌ను కూడ తానే కనిపెట్టానని బాబు చెప్పుకొంటాడని బాబు తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో స్ట్రీట్ లైట్‌ వెలగకపోతే  తన కంప్యూటర్లో కన్పిస్తోందని కూడ బాబు చెప్పుకొంటాడని ఆయన గుర్తు చేశారు.

ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే  ఆ నెపాన్ని మరోకరిపైకి నెట్టే ప్రయత్నం చేస్తాడని ఆయన చెప్పారు. పీవీ సింధు కోచ్ తప్పిదమని అతడిపై నెట్టే ప్రయత్నం చేస్తాడన్నారు. బిల్‌గేట్స్ కంప్యూటర్  బటన్ సరిగా నొక్కని కారణంగానే కంప్యూటర్ సరిగా పనిచేయలేదని బాబు తప్పించుకొంటాడని జగన్ ఎద్దేవా చేశారు.

తాను ఓటమి పాలయ్యే అవకాశం ఉందనిభావించిన నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు  ఈవీఎంలపై నెపాన్ని నెట్టే ప్రయత్నం  చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

ఫ్యాన్‌కు పడకపోతే ఊరుకొనేవాడిని కాదు: చంద్రబాబుకు జగన్ కౌంటర్

పోలింగ్ దాడులపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు