అవనిగడ్డ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శిశుపాలుడు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో శిశుపాలుడు అనే రాక్షసుడు ప్రజలను వేధిస్తే ప్రస్తుతం నారా సురుడు అనే చంద్రబాబు నాయుడు మరో శిశుపాలుడుగా తయారయ్యారంటూ ధ్వజమెత్తారు. 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు లాంటి రాక్షసుడిని గద్దె దించేది ప్రజలేనని చెప్పుకొచ్చారు. శిశుపాలుడు100 తప్పులు వరకు శ్రీకృష్ణుడు వేచి చూసి 101 తప్పుతో శ్రీకృష్ణుడు విష్ణుచక్రంతో సంహరించాడని చెప్పుకొచ్చారు. 

అలాగే ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో నేరాలు, మోసాలు, వెన్నుపోటులకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. నరకంలో ఉన్న శిశుపాలుడు యమధర్మరాజును ఓ ప్రశ్న అడిగారట అంటూ కథ చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. 

నరకంలో ఉన్న శిశుపాలుడు యముడును తాను 101 తప్పులు చేస్తే విష్ణుచక్రంతో సంహరించారు మరి ఏపీలో చంద్రబాబు చేస్తున్న మోసాలపై ఎందుకు విష్ణుచక్రం ప్రయోగించడం లేదని నిలదీశారని చెప్పుకొచ్చారు. 

శిశుపాలుడిలాంటి చంద్రబాబు పాలిట విష్ణు చక్రం ఫ్యాన్ చక్రం అంటూ చెప్పుకొచ్చారు. ఆయుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడును వధిస్తే నేడు ఏపీ ప్రజలు ఈవీఎం అనే ఓటింగ్ మిషన్ మీద వేలుపెట్టి నొక్కి చంద్రబాబును దించబోతున్నారని యముడు చెప్పినట్లు చెప్పుకొచ్చారు. 

ఈయుగంలో విష్ణు చక్రానికి ప్రతిరూపం ఫ్యాన్ చక్రం అయితే శ్రీకృష్ణుడుకు ప్రతిరూపం ఆంధ్రరాష్ట్ర ప్రజలు అని  జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడుకు మాత్రమే ప్రతిరూపం కాదని నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు కలిపి జాయింట్ వెంచర్ గా చంద్రబాబునాయుడు జన్మించారంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అంతటి చంద్రబాబునాయుడును శిక్షించేందుకు కాస్త టైమ్ పడుతోందని యముడు చెప్పినట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చెప్పిన కథను ప్రజలు ఆసక్తిగా విన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

నువ్వు పెద్దకొడుకు అయితే మేము బతకడం కష్టమే: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

బాహుబలి సినిమా చూపించి తప్పించుకుంటారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

జనసేనకు గుడ్ బై చెప్పిన మాజీమంత్రి తనయుడు: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యర్రా