Asianet News TeluguAsianet News Telugu

జనసేనకు గుడ్ బై చెప్పిన మాజీమంత్రి తనయుడు: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యర్రా

వైఎస్ జగన్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు యర్రా నవీన్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల క్రితం యర్రా నవీన్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. 

ex janasena party leader yarra naveen join ysr congress party
Author
Koyyalagudem, First Published Mar 19, 2019, 3:57 PM IST

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీమంత్రి యర్రా నారాయణ స్వామి తనయుడు మాజీ జనసేన నేత యర్రా నవీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బహిరంగ సభలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

వైఎస్ జగన్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు యర్రా నవీన్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల క్రితం యర్రా నవీన్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. 

మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. నియోజకవర్గం అభ్యర్థి బాలరాజు విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తానని యర్రా నవీన్ స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios