Asianet News TeluguAsianet News Telugu

అది నిజం కాదా జేడీ గారూ..? మళ్లీ మొదలెట్టిన విజయసాయి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ ట్విట్టర్ లో వార్ మొదలుపెట్టారు. జనసేన88 సీట్ల విజయం మీద మొదలైన చర్చ.. ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. పోటీచేసిందే 65సీట్లు.. 88ఎలా గెలుస్తారంటూ విజయసాయి చేసిన కామెంట్స్ కి తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

vijayasai reddy again targeted ex Jd lakshminarayana in twitter
Author
Hyderabad, First Published Apr 20, 2019, 1:07 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ ట్విట్టర్ లో వార్ మొదలుపెట్టారు. జనసేన88 సీట్ల విజయం మీద మొదలైన చర్చ.. ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. పోటీచేసిందే 65సీట్లు.. 88ఎలా గెలుస్తారంటూ విజయసాయి చేసిన కామెంట్స్ కి తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై మళ్లీ విజయసాయి ట్వీట్లు చేశారు.

‘‘జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్  బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి.’’ అని ఆరోపించారు.

మరో ట్వీట్ లో ‘‘పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

‘‘His Master's Voice (HMV) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే.  ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి.’’ అని విజయసాయి ఆరోపించారు.

‘‘జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది.’’ అని విజయసాయి ట్వీట్ చేశారు. 
 

related news

88 సీట్ల లెక్క... విజయసాయికి లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

‘పోటీచేసిందే 65 సీట్లలో.. 88సీట్లు ఎలా వస్తాయి జేడీగారు..?’

Follow Us:
Download App:
  • android
  • ios