సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇటీవల మాజీజేడీ లక్ష్మీనారాయణ.. తమ జనసేన పార్టీ 88సీట్లు గెలుచుకోని అధికారంలో చేపడుతుందని పేర్కొన్నారు. కాగా.. ఆయన చేసిన కామెంట్స్ కి విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

‘‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జెడి లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’’ అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.