జనసేన ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య ట్విట్టర్ లో వార్ జరుగుతోంది. విజయసాయి రెడ్డికి లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల లక్ష్మీనారాయణ.. తమ జనసేన పార్టీ 88సీట్లు గెలుస్తుందని.. తాము అధికారంలోకి వస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. జనసేన పోటీచేసేందే 65 స్థానాలైతే.. 88సీట్లు ఎలా వస్తాయని.. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగా అంటూ... వెటకారంగా ట్వీట్ చేశారు.

కాగా.. విజయసాయి ట్వీట్ కి అదే రీతిలో లక్ష్మీనారాయణ రిప్లై ఇచ్చారు. ‘‘గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో..‘‘మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.’’ అని పేర్కొన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఏ2 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. ఆనాటి విషయాలను గుర్తుచేస్తూ లక్ష్మీనారాయణ... విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. 

related news

‘పోటీచేసిందే 65 సీట్లలో.. 88సీట్లు ఎలా వస్తాయి జేడీగారు..?’