తిరుపతి: సంక్షేమ పథకాలు, అభివృద్ధి చంద్రబాబుకు మరోసారి ఏపీలో అధికారాన్ని కట్టబెట్టనున్నారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. సంక్షేమ పథకాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబుకు మరోసారి అధికారాన్ని  ఇవ్వాలని భావించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆదివారం నాడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను విడుదల చేశారు.ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితాలను లగడపాటి రాజగోపాల్ వివరించారు. 

ఐదేళ్లలో ఏపీలో చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు  టీడీపీకి కలిసివచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం కొనసాగితే రాజధాని నిర్మాణంతో పాటు ఇతర కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉందని ప్రజలు భావించారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.  మరో వైపు మహిళలు ఎక్కువగా టీడీపీ వైపుకు మొగ్గు చూపారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

ఇంతవరకు తాను ఏనాడూ కూడ సర్వే ఫలితాలను ఎవరికీ విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చిన సర్వే ఫలితాలతో తనకు సంబంధం లేదని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

టీడీపీదే గెలుపు, 2 శాతం ఓటింగ్ తేడా: లగడపాటి సర్వే

ఎపిలో టిడీపికే పట్టం, జగన్ ఆశలు గల్లంతే: లగడపాటి ఎగ్జిట్ పోల్‌ సర్వే