తిరుపతి:  ఏపీ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తోందని విజయవాడ మాజీ ఎంపీ  లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. 

ఆదివారం నాడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను విడుదల చేశారు.ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితాలను లగడపాటి రాజగోపాల్ వివరించారు. 

ఈ ఏడాది జనవరి నుండి ఎన్నికల వరకు, ఆ తర్వాత కూడ ప్రజల మనోభావాలను కూడ పరిగణనలోకి తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. శాస్త్రీయంగా ఈ సర్వేను నిర్వహించినట్టుగా లగపాటి రాజగోపాల్ చెప్పారు. తనకు  ఏ పార్టీతో కూడ సంబంధాలు లేవని రాజగోపాల్ స్పష్టం చేశారు. 

 ఈ దఫా మరోసారి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను కొనసాగాలని ప్రజలు భావించినట్టుగా లగడపాటి రాజగోపాల్ చెప్పారు.టీడీపీకి  వంద అసెంబ్లీ లేదా 10  అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. వైసీపీకి 72 స్థానాలు వచ్చే అవకాశం  ఉందని రాజగోపాల్ ప్రకటించారు. 7 స్థానాలు ఆ పార్టీకి పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉందన్నారు.

ఇతరులకు మూడు స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. టీడీపీకి 43 శాతం ఓట్లు వస్తాయి.వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని ఆయన వివరించారు. వైసీపీకి ప్రజా ధరణ బాగానే ఉందన్నారు. ఈ దఫా ఏపీలో బలమైన ప్రతిపక్షం ఉంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ కూడ కొన్ని ప్రాంతాల్లో బలంగా కన్పించిందన్నారు.

 ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.  ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి.

సంబంధిత వార్తలు

ఎపిలో టిడీపికే పట్టం, జగన్ ఆశలు గల్లంతే: లగడపాటి ఎగ్జిట్ పోల్‌ సర్వే