తిరుపతి:  ఏపీ రాష్ట్రంలో మరోసారి టీడీపీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ నిర్వహించిన సర్వే వివరాలను లగడపాటి రాజగోపాల్ విడుదల చేశారు.

ఆదివారం నాడు తిరుపతిలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన సర్వే ఫలితాలను రాజగోపాల్ విడుదల చేశారు. ఏ ఎన్నికలు జరిగినా కూడ ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తోందనే విషయమై రాజగోపాల్  సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను  విడుదల చేస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్‌ ఎగ్జిట్ ఫలితాల అంచనాలు తల్లకిందులయ్యాయి.


ఆర్జీ ఫ్లాష్  టీమ్ సర్వే నిర్వహించింది. లగడపాటి రాజగోపాల్  టీమ్‌ ఏప్రిల్ 12 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైగా శాంపిల్స్‌ను సేకరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారుగా 1200 పైగా శాంపిళ్లను సేకరించారు.

లగడపాటి సర్వే ప్రకారంగా ఆయా పార్టీలకు వచ్చే సీట్లు

టీడీపీ-       100  (10సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

వైఎస్ఆర్‌సీపీ- 72 (7సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇతరులు- 03 (02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)


ఇక పార్లమెంట్‌ స్థానాల్లో కూడ టీడీపీదే హావా అని లగడపాటి తేల్చి చెప్పారు.

టీడీపీ -    15 (02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

వైఎస్ఆర్సీపీ  -10 ( 02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇతరులు-0 నుండి 1 సీటు వచ్చే అవకాశం ఉంది

ఇక టీడీపీకి  43 నుండి 45 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి తేల్చి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీకి 40 నుండి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు జనసేనకు 10 నుండి 12 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది.

టీడీపీకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడ  అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టుగానే ఓటింగ్ శాతం ఉంటుందని ఈ సర్వే తేల్చింది. టీడీపీకి 43 శాతం నుండి 45 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది.

మహిళా ఓటర్లు టీడీపీ వైపుకు మొగ్గు చూపారని ఈ సర్వే తేల్చి చెప్పింది. మరో వైపు పురుషులు మాత్రం  వైసీపీ వైపుకు మొగ్గు చూపారని లగడపాటి  సర్వే టీమ్ అభిప్రాయపడింది.

సైలెంట్ ఓటింగ్ టీడీపీకి కలిసి వచ్చిందని ఆ సంస్థ చెబుతోంది. యువత మాత్రం జనసేనకు మొగ్గు చూపిందని లగడపాటి చెప్పారు.టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై ఓటర్లలో వ్యతిరేకత ఉందని లగడపాటి సర్వే టీమ్ అభిప్రాయపడింది.