కడప: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పార్ట్నర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్, డబ్బులు పంపిణీ అంతా చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. 

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు వైఎస్ జగన్.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే చంద్రబాబు నాయుడు తెరపైకి పార్ట్నర్ ని తీసుకు వచ్చారని ఆరోపించారు. 

ఇరు పార్టీల మధ్య అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను మెుదట చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకోవాలని భావించారని ఆయనను భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని కూడా చూశారని జగన్ స్పష్టం చేశారు. 

అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆయనను తన పార్ట్నర్ పార్టీలోకి పంపించారని ఆరోపించారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీటు కూడా ఇప్పించారన్నారు. 

విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ర్యాలీలో అత్యధికంగా కనిపించిన జెండాలు టీడీపీ జెండాలేనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ లో టీడీపీ జెండాల దర్శనమే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ పార్ట్నర్ అనడానికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. 

ఈ వార్తలు కూడా చదవండి

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏం చేశాడో తెలియదా: జగన్

చంపేది వాళ్లే, తప్పుడు రిపోర్టులిచ్చేది వాళ్లే: బాబాయ్ హత్యపై జగన్