కర్నూల్: కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కొడుకు కేఈ శ్యాంబాబును బరిలోకి దింపుతున్నాడు. డోన్ నుండి కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు.

కర్నూల్ జిల్లాలో కేఈ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో క్రియాశీలకంగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

1989, 2009 ఎన్నికల్లో డోన్ నుండి కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. 1989లో ఈ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కేఈ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పత్తికొండ నుండి కేఈ కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. ఈ స్థానం నుండి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

డోన్ నుండి  కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ మరోసారి బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో  కేఈ సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి ఇదే స్థానం నుండి ప్రతాప్ బరిలోకి దిగనున్నారు.

కేఈ మరో సోదరుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కేఈ కృష్ణమూర్తి స్థానంలో శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయనున్నారు ఇదిలా ఉంటే  కేఈ కుటుంబం కోట్ల కుటుంబంతో ఢీ కొట్టింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవలనే టీడీపీలో చేరారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన కర్నూల్ ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు. అదే సమయంలో కేఈ కృష్ణమూర్తి పోటీకి దూరం కావడం గమనార్హం