ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. కాగా... అనంతపురంలో టీడీపీ అభ్యర్థి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌ వెనకంజలో ఉన్నారు. కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి,ఆధిక్యంలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.