నగరి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై కోర్టుల్లో జరగుతున్న వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడు సినిమా చూడాలంటాడని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. 

మీకు అనుకూలంగా ఉన్న సినిమా అయితే చూడాలా, మీకు వ్యతిరేకం అని అనిపిస్తే ఆ సినిమాను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారా అంటూ నిలదీశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా విడుదలను అడ్డుకుంటూ నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. 

భవిష్యత్ లో చంద్రబాబుకు ఓటేస్తే ఇంకా ఎన్నో ఆంక్షలు ఉంటాయంటూ జగన్ ధ్వజమెత్తారు. బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలే చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని, వారికి నచ్చిన ఛానెల్స్ చూడాలనేలా ప్రవర్తిస్తారంటూ విరుచుకుపడ్డారు. 

ఏపీలోకి రాకుండా సీబీఐను అడ్డుకుంటారు, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రానివ్వరు, ఇతర రాష్ట్రాల పోలీసులను రానివ్వరు ఇలా ఉంటే శాంతిభద్రతలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోవాలని సూచించారు. 

సీబీఐ, ఎన్ఐఏ, వివిధ డిపార్ట్మెంట్లను అడ్డుకున్న చంద్రబాబు రేపు ఎవరినైనా చంపేసినా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉండదన్నారు. అంతేకాదు ఆయనను వ్యతిరేకిస్తే బతకనిచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. చం‍ద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు కూడా ఉండవన్నారు వైఎస్ జగన్. ఆలోచించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని కోరారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మీరెంతమంది వచ్చినా ఇక్కడ ఉంది జగన్ అనే సింహం: రోజా ఫైర్

పొలిటికల్ సూపర్ స్టార్, అసెంబ్లీ టైగర్ వైఎస్ జగన్ : రోజా