చిత్తూరు: జాతీయ నాయకులు ఎంతమంది గుంపులు వచ్చినా ఇక్కడ ఉంది వైఎస్ జగన్ అనే సింహమన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె జాతీయ నాయకులు వచ్చి ఏపీలో పర్యటిస్తున్నారని వారంతా చంద్రబాబు మోసాలకు సమాధానం చెప్తారా అంటూ సవాల్ విసిరారు. 

జాతీయ నాయకులు అప్పుడు కలిసొచ్చారు ఇప్పుడు విడివిడిగా వస్తున్నారన్నారు. పొత్తు మాత్రం సేమ్‌ టూ సేమ్‌ అంటూ ధ్వజమెత్తారు. తెలుగువాడి గుండె ధైర్యం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని రోజా స్పష్టం చేశారు. 

ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉంది సింహం అని ఆ సింహం ముందు మీలాంటి చిట్టెలుకలు ఎంతమంది ఉన్నా ఇక అంతేనంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మడం లేదని గ్రహించి జాతి నాయకులు, జాతీయ నాయకులపై ఆధారపడ్డారని ధ్వజమెత్తారు. త్వరలో వారు కూడా రారని చెప్పుకొచ్చారు రోజా. 

ఈ వార్తలు కూడా చదవండి

పొలిటికల్ సూపర్ స్టార్, అసెంబ్లీ టైగర్ వైఎస్ జగన్ : రోజా