తిరుపతి: తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని ముందే తెలియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ప్రస్టేషన్లోకి వెళ్లిపోయిందన్నారు. తిరుపతిలోని ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 

రాబోయే ఎన్నికల్లో గెలుపు నాకే రాశారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో 150పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని అలాగే 25 పార్లమెంట్ అభ్యర్థులను గెలుపుంచుకుంటామని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధిస్తోందని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. 

కోడికత్తి పార్టీ ఎన్నో డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేస్తున్న దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్లారు, రక్తపు మరకలను ఎందుకు తుడిచిపెట్టేశారు, బెడ్ షీట్లను ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి వ్యక్తి చనిపోతే హత్యకు గురైనట్లు తెలుస్తోంటే హార్ట్ ఎటాక్ అని ఎందుకు చిత్రీకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూసి కుమార్తె సునీత పోస్టుమార్టం చెయ్యాలని డిమాండ్ చేస్తే చేయించారని అప్పటి వరకు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోస్ట్ మార్టంలో అసలైన విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. తీగ లాగితే డొంక కదిలిందని తెలిపారు. 

మీ ఇంట్లో హత్య జరిగింది, సాక్ష్యాలను తారుమారు చేసింది మీ ఇంట్లో వాళ్లు అయితే నిందలు తమపై మోపుతావా అంటూ ప్రశ్నించారు. సీబీఐ విచారణ అంటూ నాటకాలు ఆడతారా అంటూ ప్రశ్నించారు. 

సొంత చిన్నాన్న చనిపోతే నిందితులను పట్టుకునేందుకు సహకరించాల్సింది పోయి రాజకీయం కోసం అడ్డుకుంటావా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై డ్రామాలు ఆడతారా అంటూ విరుచుకుపడ్డారు. 

ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇలాంటి హత్యలకు పాల్పడితే రేపు ఏదో దురదృష్టం కలిసొచ్చి 10 సీట్లు ఎక్కువ వచ్చి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏంచేస్తారో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తయారు చేస్తారంటూ మండిపడ్డారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ నీకు బెదిరేది లేదు, వేషాలు వేస్తే బుద్ది చెప్తా: చంద్రబాబు వార్నింగ్

బాంబులకు, బుల్లెట్లకు భయపడని మేము, నీకు భయపడతామా: చంద్రబాబు ఫైర్