తిరుపతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది తానేనని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ లో కంపెనీలు తీసుకువచ్చేందుకు ఎన్నో కష్టాలు అనుభవించానని తెలిపారు. 

తాను చేసిన అభివృద్ధే తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. తాను చెట్టు నాటితో పండ్లు మీరు తింటున్నారంటూ చెప్పుకొచ్చారు. అలాంటి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ రెచ్చిపోయారు. తనను బెదిరిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. 

ఉమ్మడి ఆస్తులుకు సంబంధించి లక్ష కోట్లు రావాల్సి ఉండగా తిరిగి తామే ఇవ్వాలంటూ కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మా విద్యుత్ వాడుకుని రూ.5వేల కోట్లు ఇవ్వాల్సింది వాస్తవం కాదా అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ నీకు బెదిరిపోయేది ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. వేషాలు వేస్తే తగినరీతిలో బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.  

ఈ వార్తలు కూడా చదవండి

బాంబులకు, బుల్లెట్లకు భయపడని మేము, నీకు భయపడతామా: చంద్రబాబు ఫైర్