అమరావతి: అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన జగన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ నెల 31వ తేదీన జగన్ సచివాలయానికి రానున్నారు.

ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్  సీఎంగా ప్రమాణం చేయనున్నారు.  సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత  న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. న్యూఢిల్లీ నుండి  తిరిగి వచ్చిన వెంటనే జగన్ సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. సచివాలయంలో ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. 

సచివాలయంలో సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్లను వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

రేపు జగన్ ఒక్కరే: జూన్ 7న కొత్త మంత్రులు

ఈ నెల 31న సచివాలయానికి జగన్

జగన్ 'ఒక్క ఛాన్సే' మన కొంపముంచింది

కేసీఆర్ ఇంటికెళ్లిన జగన్, చంద్రబాబుకేమో ఫోన్: టీడీపీ మంట అదే