MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • AP Budget 2026 : పవన్ కల్యాణ్, లోకేష్ లలో పైచేయి ఎవరిది? ఎవరికెన్ని నిధులు దక్కాయో తెలుసా..?

AP Budget 2026 : పవన్ కల్యాణ్, లోకేష్ లలో పైచేయి ఎవరిది? ఎవరికెన్ని నిధులు దక్కాయో తెలుసా..?

Andhra Pradesh Budget 2026-27 :  ఏపీ బడ్జెట్ 2026 నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ మొదలయ్యింది. రాష్ట్ర బడ్జెట్ లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లలో ఎవరికి అత్యధిక నిధులు దక్కాయి..? ఎవరిది పైచేయిగా నిలిచింది..? 

3 Min read
Author : Arun Kumar P
Published : Feb 14 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి..?
Image Credit : X/naralokesh

ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి..?

AP Budget 2026 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆదాయం, ఖర్చులకు సంబంధించిన ప్రణాళికను ఇవాళ (ఫిబ్రవరి 14, శనివారం) అసెంబ్లీ సాక్షిగా ప్రజలముందు ఉంచారు. మొత్తం 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఖర్చు చేయనుంది కూటమి ప్రభుత్వం.

అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగిన విషయం తెలిసిందే. పాలనాపరమైన వ్యవహారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత తమ నాయకుడికే ప్రాధాన్యం దక్కాలంటూ ఇటు టిడిపి, అటు జనసేన నాయకుల మధ్య వాగ్వాదం సాగింది. చివరకు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టిడిపి శ్రేణుల నుండి వినిపించింది. కానీ పవన్, లోకేష్ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు... దీంతో ఈ గొడవ సద్దుమణిగింది.

ఈ బడ్జెట్ 2026 సందర్భంగా మరోసారి పవన్, లోకేష్ ఆధిపత్యపోరు అంశం తెరపైకి వచ్చింది. బడ్జెట్ లో ఎవరి శాఖలకు ఎక్కువ కేటాయింపులు లభించాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాబట్టి ఈ బడ్జెట్ లో ఎవరిది పైచేయిగా నిలిచిందో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కళ్యాణ్ శాఖలకు కేటాయింపులు..
Image Credit : X/JanaSenaParty

పవన్ కళ్యాణ్ శాఖలకు కేటాయింపులు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగానే కాదు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర & సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ బడ్జెట్ 2026 లో ఈ శాఖలో ఎన్ని నిధులు కేటాయించారో చూద్దాం.

పంచాయితీ రాజ్ శాఖకు ఈ బడ్జెట్ లో భారీగానే నిధులు దక్కాయి. మొత్తం రూ.22,942 కోట్లను ఈ శాఖకు కేటాయించింది ప్రభుత్వం. ఇక అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాలకు కూడా నిధులు దక్కాయి. ఇలా పవన్ కళ్యాణ్ శాఖలకు దాదాపు రూ.23,000 కోట్ల నుండి రూ.25,000 కోట్ల వరకు దక్కాయి.

35
నారా లోకేష్ శాఖలకు కేటాయింపులు...
Image Credit : Nara Lokesh Twitter

నారా లోకేష్ శాఖలకు కేటాయింపులు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోనే కాదు కూటమి ప్రభుత్వంలోనే కీలక నాయకుడు. చెప్పాలంటే తండ్రి తర్వాత సెకండ్ ప్లేస్ అతడిదే. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం బైటపడింది... తాజాగా బడ్జెట్ 2026 లోనూ ఇది స్పష్టంగా కనిపించింది.

లోకేష్ మానవ వనరుల అభివృద్ధి (విద్యాశాఖ),స‌మాచార సాంకేతికత (ఐటీ), ఎలక్ట్రానిక్స్‌ ఆండ్ కమ్యూనికేషన్స్‌, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. ఇందులో ఆయన విద్యాశాఖపై స్సెషల్ ఫోకస్ పెట్టారు.. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో పాఠశాల విద్యాశాఖకు ఏకంగా రూ.32,308 కోట్లు నిధులు దక్కాయి.

ఇక విద్యాశాఖకు సంబంధించిన పథకాలు, ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం. విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనానికి రూ.2161 కోట్లు, విద్యార్థుల ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ. 1,232 కోట్లు కేటాయించారు. ఇలా విద్యాశాఖకు భారీగా నిధులు దక్కాయి.

హైదరాబాద్ కు పోటీగా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖపట్నం, అమరావతి వంటి ప్రాంతాల్లో పెట్టుబుడులకు ముందుకువచ్చిన కంపెనీలకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖకు నిధులు కేటాయించింది.

45
పవన్ పై లోకేష్ దే పైచేయి..
Image Credit : X/naralokesh

పవన్ పై లోకేష్ దే పైచేయి..

పపన్ కళ్యాణ్, నారా లోకేష్ మధ్య పొలిటికల్ గా కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో బడ్జెట్ 2026 లో ఎవరు పైచేయి సాధించారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నారా లోకేష్ శాఖలకు ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు దక్కాయి... ఆ తర్వాతి స్థానంలోనే పవన్ కళ్యాణ్ శాఖలు నిలిచాయి. టిడిపిలోనే కాదు పాలనలోనూ లోకేష్ ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి ఈ బడ్జెట్ 2026 లో జరిగిన కేటాయింపులే నిదర్శనం.

55
నెక్ట్స్ సీఎం లోకేషేనా..?
Image Credit : X/Nara Lokesh

నెక్ట్స్ సీఎం లోకేషేనా..?

తన వారసుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్దం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చంద్రబాబు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.. ప్రస్తుతం అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే లోకేష్ ను పొలిటికల్ గా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే తరచూ తనతో పాటు లోకేష్ ను కూడా డిల్లీకి తీసుకెళుతున్నారు చంద్రబాబు... కేంద్ర పెద్దలతో పరిచయాలు పెంచుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని టిడిపి నాయకులందరితో లోకేష్ సత్సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు... అందుకోసమే తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇలా లోకేష్ ను చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం దిశగా నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ
జనసేన
విజయవాడ
అమరావతి
విశాఖపట్నం
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image2
Now Playing
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
Recommended image3
Now Playing
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Nara Lokesh Visits Innovation Fair: ఈ రోబో చేసిన పనికి షాకైన మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : డిప్యూటీ సీఎం లగ్జరీ కార్ కలెక్షన్ .. ఎన్ని కార్లున్నాయి..? వీటి విలువ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved