అమరావతి: ఈ ఏడాది జూన్ ఏడో తేదీన  మంత్రివర్గాన్ని జగన్ విస్తరించే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన జగన్ ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.  విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణం చేస్తారు.

ముఖ్యమంత్రిగా తాను ఒక్కరినే ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు.జూన్ 7వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

శాసనసభ సమావేశాల నిర్వహణ కోసం జూన్ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.  ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో అసెంబ్లీ అధికారులు చర్చించారు.  కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి సమాచారం అందించారు.

జూన్ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మరో వైపు జూన్ 3 నుండి 6 వరకు జగన్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

ఈ నెల 31న సచివాలయానికి జగన్

జగన్ 'ఒక్క ఛాన్సే' మన కొంపముంచింది

కేసీఆర్ ఇంటికెళ్లిన జగన్, చంద్రబాబుకేమో ఫోన్: టీడీపీ మంట అదే