రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వివాదంపైనా విజయసాయి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ మాజీ డీజీపీగా ఉన్న కాలంలో ఆయన అక్రమ పద్ధతిలో రూ. వేల కోట్ల ఆస్తులను పోగెసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఏబీవీ యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్తంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పింది ఆయనేనంటూ వ్యాఖ్యానించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్షను అనుభవించక తప్పదని విజయసాయి ట్వీట్ చేశారు. 

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు అండగా నిలిచారు. రాజధానిపై వివరణ ఇచ్చినందుకే జీవీఎల్‌పై యెల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విజయసాయి మండిపడ్డారు. రాజధాని వ్యవహరంలో తమ జోక్యం ఉండదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని ఆయన ట్వీట్ చేశారు.  

Also Read:

తెలంగాణ, కర్ణాటకల్లో వందల ఎకరాలు కొన్నారు: ఏబీవీపై చెవిరెడ్డి వ్యాఖ్యలు

ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై కేంద్ర సంస్థతో దర్యాప్తు: ఆ 7 అభియోగాలు ఇవే