తిరుమల : వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ నేరచరిత్ర  కలిగిన వ్యక్తి అంటూ గురువారం చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. 

శుక్రవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకుంది చంద్రబాబు నాయుడు  కాదా అని నిలదీశారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 

చంద్రబాబుపై 18 కేసులు ఉన్నా నేటికి విచారణకు హాజరుకాకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇంట్లో బాంబులు పేల్చిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గన్ పేల్చిన ఎమ్మెల్యే బాలకృష్ణలను పక్కన పెట్టుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, టీడీపీ, కుమ్మక్కై వైఎస్ జగన్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టాయని ఆరోపించారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ ధైర్యంగా కోర్టులకు హాజరవుతుంటే చంద్రబాబు మాత్రం పారిపోతున్నారన్నారు. 

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది చంద్రబాబేనని ఆపరేషన్ గరుడ ప్లాన్ తో జగన్ ను హత్య చేయించడానికి ప్లాన్ వేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లుగా చంద్రబాబు ఎన్ని యూ టర్న్ లు తీసుకున్నారో ప్రజలకు తెలుసునని ఆయన మాటలను నమ్మేవారు ఎవరూ లేరని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అడ్డొస్తే... తప్పించడమే: పరిటాలను అలాగే, బాబుపై రోజా వ్యాఖ్యలు

అదే జరిగితే చంద్రబాబు, లోకేషే మిగులుతారు: రోజా

చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారు, అతడ్ని సస్పెండ్ చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్