చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌పై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తప్పు చేయలేదు కాబట్టే జగన్ ధైర్యంగా విచారణకు హాజరవుతున్నారన్నారని స్పష్టం చేశారు.

కడిగిన ముత్యంలా నిర్దోషిగా జగన్ బయటపడతారని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకుని విచారణకు హాజరుకాని ముద్దాయి చంద్రబాబని ఆమె ఆరోపించారు.

దేశంలో మహిళలను వేధించిన నలుగురు మంత్రుల్లో... ఇద్దరు చంద్రబాబు కేబినెట్‌లోనే ఉన్నారని రోజా మండిపడ్డారు. రౌడీ చింతమనేనికి విప్ పదవి ఇచ్చి ప్రజలపైకి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు రాజకీయంగా అడ్డు వచ్చే వారిని, అడ్డు తొలగించుకునే వ్యక్తి చంద్రబాబన్నారు. గతంలో రంగారెడ్డి, మాధవరెడ్డి, పరిటాలను అలానే తొలగించారని రోజా ఆరోపించారు. జగన్‌ను ఎదుర్కోలేకే, ఆయనపై హత్యాయత్నం చేయించారన్నారు.