Asianet News TeluguAsianet News Telugu

మా పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదు... ఆమెపై నీలాపనిందలా..: నారా రోహిత్ ఆవేదన

తన పెద్దమ్మ నారా భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అధికార వైసిపి నేతల అవమానించడాన్ని నిరసిస్తూ నారావారిపల్లెలో హీరో నారా రోహిత్ ఆందోళనకు దిగారు. 

YSRCP Leaders Insulting Nara Chandrababu and his wife Bhuvaneshwari... tollywood hearo nara rohit protest at naravaripalli
Author
Naravaripalli, First Published Nov 21, 2021, 1:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చిత్తూరు: అసెంబ్లీ సాక్షిగా నిండుసభలో తన భార్య నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయి మీడియా ఎదుటే బోరున విలపించారు. రాష్ట్ర ప్రజలకు తనకు అసెంబ్లీలో వైసిపి సభ్యుల నుండి ఎదురైన అవమానం గురించి వివరిస్తూ చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. అసెంబ్లీ ఘటన, చంద్రబాబు ఏడవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ఈ వ్యవహారంపై భగ్గుమన్న TDP శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తాజాగా nara chandrababu naidu సోదరుడి కుమారుడు, హీరో నారా లోకేష్ కూడా తమ స్వస్థలమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆందోళనకు దిగాడు. ఆదివారం ఉదయమే తమ తాత నాయరమ్మ నారా కర్జూర నాయుడు, నారా అమ్మణమ్మ సమాధులకు నివాళి అర్పించిన nara rohit అక్కడే కూర్చుని నిరసన చేపట్టారు. 

వీడియో

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి ఇక్కడే బైఠాయించానని అన్నారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ nara bhuvaneshwari, సోదరుడు nara lokesh క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు. 

read more  నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

రాష్ట్ర ప్రజలు ఎంతో అభిమానించే అన్న NTR సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు nandamuri family ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి  ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని రోహిత్ పేర్కొన్నారు. 

తమ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదన్నారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది... అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. జీవితంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి నేతలు మనసు గాయపర్చినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుపాను బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారని రోహిత్ తెలిపారు. 

తమ స్వార్థ రాజకీయాల కోసం మరోసారి తమ కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేది లేదన్నారు. నారా వారి కుటుంబంపై గానీ, పెద్దమ్మ భువనేశ్వరిపై గానీ ఇటువంటి దారుణవ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ వైసిపి నాయకులకు నారా రోహిత్ హెచ్చరించారు. 

read more  వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం.. ఎవరు ఏమన్నారంటే?

ఇదిలావుంటే తన కుటుంబంపై వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ చంద్రబాబు మీడియా ఎదుటే బోరున విలపించడం దేశవ్యాప్తంగా ప్రసారమయ్యింది. దీంతో రాష్ట్ర నాయకులే కాదు జాతీయ స్థాయి నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులు చంద్రబాబును పరామర్శిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి దైర్యం చెప్పారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. సభ సజావుగా జరగకుండా వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చి దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. తన చెల్లెలు భువనేశ్వరిపై వ్యక్తిగత దాడి దురదృష్టకరమని అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికావని హితవు పలికారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

సభలో ఎంతో మేధావులు ఉన్నారు... కానీ ఇంత నీచానికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. తాను ఒక శాసనసభ్యుడినని తన మీదకు రావచ్చని... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీదకు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి తల్లులు, భార్యలు, పిల్లలు ఉన్నారని, పర్సనల్‌గా టార్గెట్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని బాలయ్య హెచ్చరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios